Michael OTT Release : సందీప్ కిషన్, విజయ్ సేతుపతి 'మైఖేల్' - ఆహాలో రిలీజ్ ఎప్పుడంటే?
సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'మైఖేల్'. 'ఆహా' ఓటీటీలో సినిమా విడుదల కానుంది. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే...
సందీప్ కిషన్ (Sundeep Kishan) కథానాయకుడిగా రూపొందిన పాన్ ఇండియా సినిమా 'మైఖేల్' (Michael Movie). ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆయన స్పెషల్ యాక్షన్ రోల్ చేశారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ విలన్‌గా నటించారు. ఈ నెలలోనే సినిమా ఓటీటీలోకి వస్తోంది.
'ఆహా'లో ఫిబ్రవరి 24 నుంచి 'మైఖేల్'
'మైఖేల్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను 'ఆహా' ఓటీటీ వేదిక సొంతం చేసుకుంది. ఈ నెల 24న వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. ''రెడీగా ఉండండి. పిచ్చెక్కించే యాక్షన్ తో రాబోతున్నాడు మన మైఖేల్. నాన్ స్టాప్ యాక్షన్ ఎంటర్టైనర్'' అని 'ఆహా' పేర్కొంది.
Also Read : 'వినరో భాగ్యము విష్ణు కథ' రివ్యూ : కిరణ్ అబ్బవరానికి హిట్ వచ్చిందా? లేదా?
View this post on Instagram
థియేటర్లలో మిశ్రమ స్పందన!
ఫిబ్రవరి 3న దక్షిణాది భాషలు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలోనూ 'మైఖేల్' సినిమా విడుదలైంది. దివంగత శ్రీ. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
Also Read : ఫిల్మ్ సిటీలో చిరుత దాడి - ఆసుపత్రిలో అక్షయ్ కుమార్ సినిమా మేకప్ ఆర్టిస్ట్
'మైఖేల్' తన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో సందీప్ కిషన్ చాలా తీవ్రంగా కష్టపడ్డారు. ఆయన సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేశారు. అంతే కాదు... ఈ సినిమా కోసం సుమారు 24 కిలోల బరువు తగ్గారు. సినిమా మేకింగ్, టేకింగ్ బావున్నాయని పేరు వచ్చింది. కానీ, ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాలేదు. సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన 'నువ్వుంటే చాలు' పాట కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సందీప్ కిషన్, హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ మీద తెరకెక్కించిన ఆ పాట రొమాంటిక్ గా ఉందని పేరు వచ్చింది.
తల్లీ కొడుకులుగా అనసూయ, వరుణ్ సందేశ్!
'మైఖేల్'లో 'హ్యాపీ డేస్' ఫేమ్ వరుణ్ సందేశ్, స్టార్ యాంకర్ అండ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్, నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నటించారు. సినిమాలో సర్‌ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే... అనసూయ, వరుణ్ సందేశ్ క్యారెక్టర్లు. గౌతమ్ మీనన్ భార్య పాత్రలో అనసూయ నటించారు. వాళ్ళిద్దరి కుమారుడిగా వరుణ్ సందేశ్ కనిపించారు. విజయ్ సేతుపతికి జోడీగా వరలక్ష్మి కనిపించారు. ఒక్కొక్కరి క్యారెక్టరైజేషన్లు చాలా పెక్యులర్ గా డిజైన్ చేశారు.
'మైఖేల్'కు సీక్వెల్ కూడా!
Michael Sequel : నిజం చెప్పాలంటే... 'మైఖేల్'కు సీక్వెల్ చేయాలని చిత్ర బృందం ముందుగా డిసైడ్ అయ్యింది. మొదట పార్ట్ ఎండింగులో సినిమా సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు.
ఈ చిత్రానికి మాటలు : త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె సాంబశివరావు, ఛాయాగ్రహణం : కిరణ్ కౌశిక్, సంగీతం : సామ్ సిఎస్, సమర్పణ : నారాయణ్ దాస్ కె. నారంగ్, నిర్మాతలు : భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు, దర్శకత్వం : రంజిత్ జయకోడి.