Marana Mass OTT Streaming: ఓటీటీలోకి సైకో కిల్లర్ మూవీ 'మరణ మాస్' - తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎందులో అంటే?
Marana Mass OTT Platform: మలయాళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన లేటెస్ట్ సైకో కిల్లర్ మూవీ 'మరణ మాస్'. ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

Basil Joseph's Marana Mass Movie Streaming On SonyLIV: సైకో థ్రిల్లర్స్, క్రైమ్ మూవీస్ అంటేనే ఓ స్పెషల్ క్రేజ్. మూవీ లవర్స్, ఓటీటీ ఆడియన్స్ ఇంట్రెస్ట్‌కు అనుగుణంగా అలాంటి కంటెంట్‌నే ప్రముఖ ఓటీటీలన్నీ అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా.. మలయాళం రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మూవీ 'మరణమాస్'. ఇప్పుడు ఓటీటీలోకి సైతం వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సైకో కిల్లర్ నేపథ్యంలో సాగే 'మరణ మాస్' మూవీ ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. డార్క్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో బాసిల్ జోసెఫ్, రాజేష్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. శివ ప్రసాద్ దర్శకత్వం వహించగా.. వ్యంగ్యం, సస్పెన్స్ అంశాల కలయికతో రోలర్ కోస్టర్‌గా మూవీని తెరకెక్కించారు. మలయాళ హీరో టొవినో థామస్ ఈ మూవీని నిర్మించారు.
Pookie vibes only!
— Sony LIV (@SonyLIV) May 14, 2025
Watch #Maranamass on SonyLIV#MaranamassOnSonyLIV pic.twitter.com/F54iFILQxQ
స్టోరీ ఏంటంటే?
ఓ మర్డర్‌ను చూసినట్లు భావించే ఇద్దరు స్నేహితుల చుట్టూ కేరళ నేపథ్యంలో ఈ స్టోరీ సాగుతుంది. ఆ తర్వాత లోకల్ పాలిటిక్స్, దాని వెనుక ఎజెండాలు, ఎవరూ ఊహించని ట్విస్టులు అనూహ్యంగా వెలుగులోకి వస్తాయి. ఇక కథ విషయానికొస్తే.. కేరళలోని ఊళ్లో వృద్ధులను టార్గెట్ చేస్తాడు ఓ సైకో కిల్లర్. బ్లేడుతో మొహం అంతా చెక్కేసి నోట్లో ఓ అరటి పండు పెట్టి చంపడం ఆ కిల్లర్ స్టైల్. వరుస హత్యలతో నగరం అంతా భయ భ్రాంతులకు గురవుతారు. ఈ సీరియల్ కిల్లర్‌ను పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ అజయ్ రామచంద్రన్ రంగంలోకి దిగుతాడు.
ఇదే సమయంలో ల్యూక్.. జెస్సీ అనే కిక్ బాక్సర్‌ను ప్రేమిస్తాడు. ఓ సందర్భంలో ల్యూక్‌ను కిల్లర్ అని పోలీసులు అనుమానించడంతో జెస్సీ అతన్ని వదిలేస్తుంది. ఓ రోజు జెస్సీ ఇంటికి వస్తుండగా బస్సులో ఆమెతో కేశవ్ అనే వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తిస్తాడు. దీంతో అతని ముఖంపై పెప్పర్ స్ప్రే కొడుతుంది జెస్సీ. ఈ క్రమంలో అతని చనిపోతాడు. బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో మరో వ్యక్తి ఉంటారు. అనుకోకుండా ల్యూక్ ఆ బస్సు ఎక్కుతాడు.
వృద్ధుడి డెడ్ బాడీని మాయం చేస్తానని బస్సులోని వ్యక్తి జెస్సీ, డ్రైవర్, కండక్టర్లతో చెబుతాడు. ఈ క్రమంలో సీరియల్ కిల్లర్ ఎవరనేది బయటపడుతుంది. అసలు ల్యూక్ సీరియల్ కిల్లర్ అనే ముద్ర నుంచి బయటపడ్డాడా?, ల్యూక్‌ను సీరియల్ కిల్లర్ ఎందుకు చంపాలనుకున్నాడు? కిల్లర్ బారి నుంచి జెస్సీ, డ్రైవర్, కండక్టర్, ల్యూక్ ఎలా తప్పించుకున్నారు? అసలు వరుస మర్డర్లకు కారణాలేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
మరణ మాస్ తన మనసుకు ఎంతో దగ్గరైన సినిమా అని బాసిల్ జోసెఫ్ అన్నారు. డిఫరెంట్ కామెడీ, రోల్స్, అనూహ్యమైన ట్విస్టులు ఆడియన్స్‌కు ఓ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయని చెప్పారు.





















