అన్వేషించండి

The Family Man 3 OTT Release: స్పై థ్రిల్లర్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' సిరీస్ - ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

The Family Man 3: బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్ర పోషించిన వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'. ఈ సిరీస్ సీజన్ 3 ఈ నవంబర్ నుంచి 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ కానుంది.

Manoj Bajapayee's The Family Man 3 Web Series OTT Streaming On Amazon Prime Video: హారర్, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్, సిరీస్‌ల ట్రెండ్ సాగుతున్న క్రమంలో ఆడియన్స్‌ను పలు వెబ్ సిరీస్‌లు విశేషంగా ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. అలా భారతీయ వెబ్ సిరీస్‌ల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది 'ది ఫ్యామిలీ మ్యాన్' (The Family Man). ఈ సిరీస్ రెండు సీజన్లు పూర్తి చేసుకోగా మూడో సీజన్ కోసం అటు ఓటీటీ లవర్స్‌తో ఇటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సీజన్ 3 స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ సిరీస్‌లో బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajapayee), ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించగా.. తెలుగు దర్శక ద్వయం రాజ్ & డీకే ఈ షోని తెరకెక్కించారు. ఈ సిరీస్ సీజన్ 3 ఈ నవంబర్ నుంచి ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో (Amazon Prime Video) స్ట్రీమింగ్ కానున్నట్లు మనోజ్ బాజ్‌పాయ్ తెలిపారు. తాజాగా దీనిపై ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. 

బాలీవుడ్ స్టార్ జైదీప్ అహ్లావత్.. 'ది ఫ్యామిలీ మ్యాన్ 3'లో (The Family Man 3) కనిపించనున్నట్లు మనోజ్ తెలిపారు. రెండేళ్ల క్రితమే ఆయన ఈ ప్రాజెక్టులో భాగమయ్యారని చెప్పారు. 'పాతాళ్‌లోక్-2లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న జైదీప్ అహ్లావత్ రెండేళ్ల క్రితమే ఇందులో జాయిన్ అయ్యారు. ఆయన రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఈ పాత్ర వివరాలు మాత్రం ఇప్పుడే వెల్లడించలేం. ఈ నవంబర్ నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.' అని తెలిపారు. అయితే, సిరీస్‌లో జైదీప్ నటిస్తున్నారని తెలిసినా.. రెండేళ్ల క్రితమే ఆయన భాగమయ్యారని ఎవరికీ తెలియదు. ఈ స్పై థ్రిల్లర్‌లో అగ్ర నటుడు భాగం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి.

Also Read: 'ఐస్‌క్రీమ్‌లా ఆస్వాదిస్తేనే సంతోషం' - తమన్నాతో బ్రేకప్ ప్రచారం వేళ రిలేషన్ షిప్‌పై విజయ్ వర్మ ఏమన్నారంటే?

విలన్‌గా జైదీప్ అహ్లావత్?

'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్‌గా 2 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మూడో సీజన్ సైతం సిద్ధమవుతోంది. శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ తిరిగి రాబోతుండగా.. ఈ సీజన్ యాక్షన్, సస్పెన్స్‌తో పాటుగా ట్రేడ్‌ మార్క్ హ్యూమర్ సమ్మేళనంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో జైదీప్ అహ్లావత్ నెగిటివ్ రోల్‌లో చేస్తున్నట్లు తెలుస్తోంది. 

పాకిస్థాన్, శ్రీలంకలో టెర్రరిజం బ్యాక్ డ్రాప్‌లో గత 2 సీజన్స్ రూపొందించారు. ఈ కొత్త సీజన్‌లో చైనాతో పొంచి ఉన్న ప్రమాదం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఫస్ట్ సీజన్‌లో టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నటించగా.. సీజన్ 2లో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కీలక పాత్ర పోషించారు. ఆ సీజన్‌లో ఆమె ప్రతినాయకురాలిగా నటించారు. తమిళ టైగర్స్ తరఫున పోరాటం చేసే మహిళగా కనిపించారు. ఇప్పుడు సీజన్ 3లో జైదీప్ నెగిటివ్ రోల్ చేస్తుండగా భారీగా హైప్ నెలకొంది. ఈ సిరీస్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget