అన్వేషించండి

Mahi V Raghav : త్వరలో 'సైతాన్ 2', అలాగే 'సేవ్ ద టైగర్స్ 2' కూడా - కన్ఫర్మ్ చేసిన మహి

'సైతాన్' వెబ్ సిరీస్ సాధించిన విజయం పట్ల మహి వి రాఘవ్ సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో రెండో సీజన్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు.

'సైతాన్' వెబ్ సిరీస్ చూసి పెదవి విరిచిన వ్యక్తులు ఉన్నారు. అందులో హింస ఎక్కువ ఉందన్నారు. నచ్చలేదని చెప్పారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అదే సమయంలో సిరీస్ మెచ్చిన జనాలు అంత కంటే ఎక్కువ మంది ఉన్నారు. లేదంటే ట్రెండింగ్ అవ్వదు కదా! 'సైతాన్' వెబ్ సిరీస్ (Shaitan Web Series)కు వస్తున్న వ్యూస్ పట్ల దర్శకుడు మహి వి. రాఘవ్ సంతోషం వ్యక్తం చేశారు.

'సేవ్ ద టైగర్స్' కంటే నాలుగు రెట్లు ఎక్కువ!
'సేవ్ ద టైగర్స్' కంటే నాలుగు రెట్లు ఎక్కువ విజయం 'సైతాన్' సాధించిందని దర్శకుడు మహి వి. రాఘవ్ తెలిపారు. తాము ఈ విజయాన్ని ఊహించలేదని ఆయన చెప్పారు. ఇంకా మాట్లాడుతూ ''సైతాన్'లో నటించిన ప్రతి ఒక్కరూ... దీనికి పని చేసిన ప్రతి సాంకేతిక నిపుణుడు ఎంతో కష్టపడి పని చేశారు. ఛాయాగ్రహణం, మాటలు, సంగీతం, కళా దర్శకత్వం నుంచి ప్రతి ఒక్కరూ బాగా పని చేశారు'' అని పేర్కొన్నారు. 'సైతాన్'కు కొనగసాగింపు ఉంటుందని స్పష్టం చేశారు. 

త్వరలో 'సేవ్ ద టైగర్స్ 2'...
అలాగే, 'సైతాన్ 2' కూడా! - మహి
'సైతాన్'కు మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. నిర్మాణ భాగస్వామి కూడా! ఈ సిరీస్ కంటే ముందు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఆయన క్రియేటర్ & నిర్మాతగా 'సేవ్ ద టైగర్స్' విడుదల అయ్యింది. అదీ మంచి విజయం సాధించింది. త్వరలో 'సేవ్ ద టైగర్స్ 2' ఉంటుందని 'సైతాన్' సక్సెస్ మీట్ (Shaitan Web Series Success Meet)లో మహి వి రాఘవ్ చెప్పారు. అలాగే, 'సైతాన్'కు కూడా కొనసాగింపు ఉంటుందన్నారు. తాను దర్శకత్వం వహించిన 'సిద్దా లోకం ఎలా ఉంది నాయనా' సినిమా త్వరలో విడుదల కాబోతోందని ఆయన తెలిపారు.

Also Read నాలుగు వందల కోట్లతో పవన్ కళ్యాణ్ సినిమా - ఒక్కొక్కరూ చెప్పేది వింటుంటే?

మంచి కంటెంట్ ఉంటే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని 'సైతాన్' ద్వారా ప్రూవ్ అయ్యిందని సావిత్రి పాత్రలో నటించిన షెల్లీ నబు కుమార్ తెలిపారు. తనకు ఆ పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు మహికి కృతజ్ఞతలు తెలిపారు. ఓ మంచి సిరీస్ చేశాననే సంతృప్తి తనకు ఉందని బాలి పాత్రలో నటించిన రిషి సంతోషం వ్యక్తం చేశారు. 

'సేవ్ ద టైగర్స్' తర్వాత 'సైతాన్' : దేవియాని శర్మ
'సేవ్ టైగర్స్' తర్వాత 'సైతాన్' సీరీస్ చేయడం, వీక్షకుల రెండిటికీ మంచి ఆదరణ లభించడం చాలా సంతోషంగా ఉందని దేవియాని శర్మ తెలిపారు. రెండిటిలో తన క్యారెక్టర్లు వేర్వేరుగా ఉన్నాయని విమర్శలు, ప్రేక్షకులు చెబుతుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.
 
'యాత్ర 2'కు అంతా రెడీ!
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) జీవితం ఆధారంగా చేయనున్న 'యాత్ర 2' ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మహి వి రాఘవ్ బిజీగా ఉన్నట్లు తెలిసింది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందులో జగన్ పాత్రను తమిళ హీరో జీవా చేయనున్నారు. 

Also Read డ్రగ్స్ కేసుతో సంబంధం లేదంటున్న అషు రెడ్డి - ఫోన్ నంబర్ బయట పెట్టొద్దని వార్నింగ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget