Maargan OTT Release Date: ఒక్క ఇంజెక్షన్‌తోనే బ్రూటల్ మర్డర్స్ - ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ 'మార్గన్'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Maargan OTT Platform: కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోని రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ 'మార్గన్' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Vijay Antony's Maargan OTT Release On Amazon Prime Video: క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోని నటించిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ 'మార్గన్'. జూన్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకోగా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకోగా ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో మూవీ అందుబాటులోకి రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓటీటీ సంస్థ వెల్లడించింది. అలాగే, 'Tentkotta' ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించగా... మీరా విజయ్‌తో పాటు ఆంటోనీ కూడా ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. విజయ్ ఆంటోని సరసన అజయ్ దిషాన్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే సముద్రఖని, మహానంది శంకర్, బ్రిగడ సాగా, వినోద్ సాగ్, ప్రీతిక తదితరులు కీలక పాత్రలు పోషించారు.
స్టోరీ ఏంటంటే?
ఓ సింగిల్ ఇంజెక్షన్‌తో బ్రూటల్ మర్డర్స్ జరుగుతుండగా పోలీస్ అధికారి ఎలా వాటిని ఛేదించారు అనేదే ఈ మూవీ స్టోరీ. ఓ రాత్రి పూట హైదరాబాద్‌లో రమ్య అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై దాడి చేసి ఓ ఇంజెక్షన్ వేయగా... శరీరమంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారిపోతుంది. ఉదయానికల్లా దేశవ్యాప్తంగా ఈ మర్డర్ కేసు సంచలనంగా మారుతుంది. ముంబయిలో అడిషనల్ డీజీపీ ధృవ కుమార్ (విజయ్ ఆంటోని) దృష్టికి ఈ కేసు వస్తుంది.
గతంలో తన కూతురు కూడా ఇలాగే హత్యకు గురవడంతో రమ్య మర్డర్ కేసును పర్సనల్‌గా తీసుకుంటాడు ధ్రువ. ఈ కేసును సాల్వ్ చేసి హంతకులను పట్టుకోవాలనుకుంటాడు. హైదరాబాద్ పోలీస్ శాఖ సహకారంతో అనఫీషియల్‌గా తన టీంతో రంగంలోకి దిగుతాడు. తనకు లభించిన చిన్న చిన్న ఆధారాలతో డి.అరవింద్ (అజయ్ దిశాన్) అనే యువకుడిని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో వరుస మర్డర్స్‌కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి. అసలు ఈ హత్యలు చేస్తుందెవరు? ఎందుకు ఇలా ఇంజెక్షన్‌తో చంపుతున్నారు? ధ్రువ కూతుర్ని మర్డర్ చేసింది ఎవరు? కేసును సాల్వ్ చేసే క్రమంలో ధ్రువకు ఎదురైన సవాళ్లేంటి? దీని వెనుక ఏదైనా మెడికల్ మాఫియా ఉందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
విజయ్ ఆంటోని (Vijay Antony) వరుస మూవీస్‌తో అలరిస్తున్నారు. త్వరలో 'భద్రకాళి'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'అరువి', 'వాల్' మూవీస్ తెరకెక్కించిన అరుణ్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 5న ప్రేక్షుకుల ముందుకు రానుంది.





















