Lavanya Tripathi: మెగా ఫ్యామిలీ స్వేచ్ఛ ఇచ్చింది - అదొక్కటే ఇబ్బంది: లావణ్య త్రిపాఠి
Lavanya Tripathi: తాజాగా ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది లావణ్య త్రిపాఠి. ఇక దీని ప్రమోషన్స్‌లో పాల్గొంటూ మెగా ఫ్యామిలీ గురించి, వరుణ్ గురించి చెప్పుకొచ్చింది.
Lavanya Tripathi about Miss Perfect: మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సినిమాల విషయంలో కాస్త స్లో అయ్యింది. ఇంతలోనే మొదటి ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌తో మరోసారి ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. తాజాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలయిన ఈ సిరీస్.. పాజిటివ్ రివ్యూలను సంపాదించుకుంటోంది. ఇందులో ఓసీడీతో ఇబ్బంది పడే పాత్రలో లావణ్య కనిపించింది. విశ్వక్ ఖండేరావ్ ‘మిస్ పర్ఫెక్ట్’కు దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న లావణ్య.. పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
30 రోజుల్లో షూటింగ్ పూర్తి..
‘మిస్ పర్ఫెక్ట్’ సిరీస్‌కు స్క్రిప్టే హైలెట్ అంటోంది లావణ్య త్రిపాఠి. ఇందులోనే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పుకొచ్చింది. రెగ్యులర్‌గా చూసే కామెడీ ఉండదని, కాస్త డిఫరెంట్‌గా ఉంటుందని హామీ ఇచ్చింది. ఈ సిరీస్‌లోని తన క్యారెక్టర్‌లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయని, ఒక నటిగా నేను భిన్నమైన రోల్స్ చేయాలని కోరుకుంటానని చెప్పింది. పైగా ఈ క్యారెక్టర్ తన రియల్ లైఫ్‌కు చాలా దగ్గరగా అనిపించిందని రివీల్ చేసింది. అంతే కాకుండా తాను అడిగి మరీ సెకండ్ టేక్స్ చేస్తుంటానని చెప్పుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ 30 రోజుల్లో పూర్తిచేశామని, ఒకవేళ సినిమా అయ్యింటే ఏడాదిపాటు షూటింగ్ సాగేదని సినిమాకు, సిరీస్‌లకు తాను గమనించిన తేడాలను చెప్పింది లావణ్య.
అర్థం చేసుకునే లైఫ్ పార్ట్‌నర్..
ఇక ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ఎక్కడికి వెళ్లినా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ‘మిస్ పర్ఫెక్ట్’ ప్రమోషన్స్‌లో కూడా ఎదురయ్యాయి. అయితే వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఏమీ మారలేదని చెప్పుకొచ్చింది లావణ్య. కెరీర్ పరంగా మెగా ఫ్యామిలీ నుండి తనకు కావాల్సినంత స్వేచ్ఛ ఉందని తెలిపింది. వరుణ్ లాంటి అర్థం చేసుకునే లైఫ్ పార్ట్‌నర్ దొరికాడని సంతోషం వ్యక్తం చేసింది. మిగతా వాళ్లు తమను చూసే విధానంలో తేడా ఉందేమో కానీ తమ వరకు గతంలోలాగే ఉన్నామని చెప్పింది. వరుణ్ తేజ్ ఇప్పటికే ‘మిస్ పర్ఫెక్ట్’ చూసి బాగుంది అన్నాడని, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ కూడా చేశాడని గుర్తుచేసుకుంది. వీరిద్దరూ.. ఎవరి ప్రొఫెషనల్ లైఫ్స్ వారు చూసుకుంటారని బయటపెట్టింది.
తొందరపడను..
‘మిస్ పర్ఫెక్ట్’ సిరీస్‌లో నటించడం ఛాలెంజింగ్ అనిపించలేదని, రిఫ్రెషింగ్‌గా ఉందని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి. వరుసగా యాక్షన్, థ్రిల్లర్స్ తర్వాత ఇలాంటి ఒక రామ్ కామ్ చేయడం చాలా ఈజీగా అనిపించిందని తెలిపింది. డైరెక్టర్ విశ్వక్ డైలాగ్ డెలివరీ క్యాచ్ చేయడం ఒక్కటే ఇబ్బందిగా ఉండేదని చెప్పింది. తాను సినిమాల ఎంపికల విషయంలో ఎప్పుడూ సెలెక్టివ్ ఉంటానని, ఎక్కువ సినిమాల్లో నటించాలని ఆరాటపడలేదని తెలిపింది. ఒకేసారి రెండు మూడు ప్రాజెక్ట్స్ ఎప్పుడూ ఎంచుకోలేదని, చేసినవి తక్కువ మూవీసే అయినా నటిగా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నించానని సినిమాల ఎంపిక విషయంలో తన ఆలోచనను బయటపెట్టింది. అయోధ్య రామ మందిరం గురించి కూడా లావణ్య మాట్లాడింది. తన సొంతూరు అయోధ్య అని, అక్కడ శ్రీరామ మందిరం కట్టడం గొప్ప విషయంగా చూస్తానని తెలిపింది. ప్రస్తుతం ఒక కొత్త హీరోతో సినిమా చేశానని, దాంతో పాటు మరో తమిళ చిత్రాన్ని సైన్ చేశానని లావణ్య క్లారిటీ ఇచ్చింది.
Also Read: సినిమాల్లోకి మెగా డాటర్ రీ-ఎంట్రీ, మలయాళ హీరోతో రొమాన్స్