అన్వేషించండి

Niharika Konidela : సినిమాల్లోకి మెగా డాటర్ రీ-ఎంట్రీ, మలయాళ హీరోతో రొమాన్స్

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక హీరోయిన్‌గా ఓ మలయాళ సినిమాలో నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.

Niharika Konidela To Romance Malayalam Actor : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా వారసురాలిగా 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది నిహారిక. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. కానీ హీరోయిన్ గా అగ్ర స్థానానికి చేరుకోలేకపోయింది. 'ఒక మనసు' సినిమా తర్వాత ‘హ్యాపి వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది. అందం, అభినయం ఉన్నా ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుంది.

చైతన్య జొన్నలగడ్డతో విడాకులు

చైతన్య జొన్నలగడ్డని ప్రేమించి పెళ్లి చేసుకున్న నిహారిక ఇటీవలే అతనితో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. గుంటూరుకు చెందిన చైతన్య జొన్నలగడ్డతో 2020లో డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చాలా ఘనంగా జరిగింది. ఓ రెండేళ్లు వీరి కాపురం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి. వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ వేడుకల్లో కూడా చైతన్య ఎక్కడా కనిపించకపోవడంతో రూమర్స్ మరింత పెరిగాయి. ఫైనల్‌గా విడాకుల గురించి వీరిద్దరూ సోషల్ మీడియాలో అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. తమ ఇష్టానుసారంగానే విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మలయాళ సినిమాలో హీరోయిన్ గా మెగా డాటర్

విడాకుల తర్వాత నిహారిక హీరోయిన్‌గా మళ్ళీ బిజీ అవుతోంది. తాజాగా ఈమె హీరోయిన్ ఓ సినిమాకి సెలక్ట్ అయింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. చాలా కాలం తర్వాత మెగా డాటర్ మల్లి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. 'మద్రాస్ కారన్' అనే మలయాళ సినిమాల్లో నిహారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో షేన్ నిగమ్‌తో కలిసి రొమాన్స్ చేయబోతోంది. మూవీ టీం నిహారికకు వెల్కమ్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ సినిమాకి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

పెళ్ళైతే నటన ఎందుకు మానేయ్యాలి

నిహారిక ఏ విషయం అయినా సూటిగా చెబుతుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘పెళ్లయ్యాక కూడా నటన కొనసాగించాలని అనుకున్నప్పటికీ అందుకు అత్తింటి వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పింది. అంతేకాదు పెళ్ళైతే నటన ఎందుకు మానేయాలి’’ అని ఇంటర్వ్యూలో తెలిపింది. అందుకే పెళ్లి తర్వాత కూడా నిర్మాతగా మీడియం బడ్జెట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించింది. రీసెంట్ గా 'డెడ్ పిక్సెల్' అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. 

మంచు మనోజ్ సరసన నిహారిక

మంచి మనోజ్ హీరోగా నటిస్తున్న 'వాట్ ద ఫిష్' సినిమాలో నిహారిక కూడా నటిస్తోంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తాజాగా నిహారిక బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఇందులో షార్ట్ డ్రెస్‌లో నిహారిక హాట్‌గా కనిపించింది. మంచు మనోజ్ సరసన మొదటిసారి నిహారిక నటిస్తుండడంతో ఈ ప్రాజెక్టు‌పై మంచి అంచనాలు ఉన్నాయి. వరుణ్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Also Read : ‘డెవిల్’ వీడియో సాంగ్: గ్లామర్ డోస్ పెంచేసిన బిగ్ బాస్ శుభశ్రీ - లిప్ లాక్స్, హాట్ సీన్స్‌తో షాకిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

టాప్ హెడ్ లైన్స్

Spirit: 'స్పిరిట్' షూటింగ్ అప్డేట్... ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పారో విన్నారా?
'స్పిరిట్' షూటింగ్ అప్డేట్... ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పారో విన్నారా?
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
NTR Jr On Balakrishna Injury: బాబాయ్ బాలయ్య కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు... ఫోనులో మావయ్యకు లోకేష్ పరామర్శ
బాబాయ్ బాలయ్య కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు... ఫోనులో మావయ్యకు లోకేష్ పరామర్శ
Manasaagadhe Song Lyrics: మనసాగదే సాంగ్ లిరిక్స్... తారా సుతారియాతో యశ్ రొమాంటిక్ మెలోడీ... ట్రెండింగ్‌లో 'టాక్సిక్' సెకండ్ సింగిల్
మనసాగదే సాంగ్ లిరిక్స్... తారా సుతారియాతో యశ్ రొమాంటిక్ మెలోడీ... ట్రెండింగ్‌లో 'టాక్సిక్' సెకండ్ సింగిల్

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget