అన్వేషించండి

Renu Desai: రేణు దేశాయ్ కథతో 'కాశీ మజిలీ'... ETV Win ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ - ఎప్పుడంటే?

Kashi Majili OTT: రేణు దేశాయ్‌లో నటి మాత్రమే కాదు... రచయిత్రి, దర్శకురాలు ఉన్నారు. ఆమె కథతో ఈటీవీ విన్ కోసం ఓ ప్రాజెక్ట్ తెరకెక్కింది. అదే 'కాశీ మజిలీ'. ట్రైలర్ విడుదల చేశారు. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రేణు దేశాయ్ కథ, నటనతో 'కాశీ మజిలీ' ఈటీవీ విన్ లో.
  • ఈ ఓటీటీ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • ట్రైలర్ కాశీలో పోయిన లగేజ్, మహిళ కష్టాలను చూపింది.
  • మూడేళ్ల తర్వాత రేణు దేశాయ్ నటనతో ఓటీటీలోకి అడుగుపెట్టారు.

Kashi Majili OTT Release Date: రేణు దేశాయ్ నటి మాత్రమే కాదు... ఆమెలో ఓ రచయిత్రి, దర్శకురాలు సైతం ఉన్నారు. 'బద్రి'తో తెలుగు తెరకు పరిచయమైన ఆవిడ, తక్కువ సినిమాలే చేశారు. ఆమె మాతృభాష మరాఠీలో 'ఇష్క్ వాలా లవ్' అని ఓ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇప్పుడు మళ్ళీ 'కాశీ మజిలీ'కి కథ, కథనం, సంభాషణలు అందించారు. ఇది తెలుగు ఓటీటీ ఫిల్మ్. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. అది ఎలా ఉంది? స్ట్రీమింగ్ ఎప్పుడు? అనేది తెలుసుకోండి.   

ఈటీవీ విన్ ఓటీటీలో 'కాశీ మజిలీ'
Kashi Majili Streaming On ETV Win OTT: ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ కోసం 'కథా సుధా'లో భాగంగా తెరకెక్కిన ప్రాజెక్ట్ 'కాశీ మజిలీ'. దీనికి రేణు దేశాయ్ కథ అందించడమే కాదు...ప్రధాన పాత్రలో నటించారు. రవితేజ 'టైగర్ నాగేశ్వర రావు'లో ఆమె ఓ పాత్ర చేశారు. ఆ తర్వాత మళ్ళీ తెరపై ఆమె కనిపిస్తుండటం ఇదే. అంతే కాదు... 'కాశీ మజిలీ'తో ఓటీటీలోకి అడుగు పెడుతున్నారు.

Also Read: Upasana Visits Kamakhya Temple - కామాఖ్య ఆలయంలో ఉపాసన... తల్లిదండ్రులతో వెళ్ళిన Ram Charan భార్య

Renu Desai: రేణు దేశాయ్ కథతో 'కాశీ మజిలీ'... ETV Win ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ - ఎప్పుడంటే?

ఈటీవీ విన్ ఓటీటీలో సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 'కాశీ మజిలీ' ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. దీనిని జెకె ఆర్ట్స్ పతాకంపై జగదీష్ కుమార్ కాళ్ళూరు నిర్మించగా... ఆరు వందలకు పైగా యాడ్స్ రూపొందించిన యమునా కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ ఎపిసోడ్‌లో రేణు దేశాయ్‌కి జోడీగా శంకర్ ఇందుచూడన్ కథానాయకుడిగా నటించారు. దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటను 'కాశీ మజిలీ' కోసం ఉపయోగించారు.

Also Read: Indian 3 - 'భారతీయుడు 3' రిలీజ్ ప్లాన్ చేస్తున్న కమల్ - శంకర్... త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

'కాశీ మజిలీ' ట్రైలర్ విషయానికి వస్తే... ఓ మహిళ కాశీ వెళతారు. అక్కడ ఆమెకు ఓ యువకుడు పరిచయం అవుతారు. వాళ్ళ లగేజీ పోతుంది. పోలీసులకు కంప్లైంట్ చేస్తారు. డబ్బులు వద్దని, తనకు బ్యాగ్ ఇప్పించమని పోలీసులను వేడుకుంటుంది ఆ మహిళా. కాశీలో ఏం జరిగింది? అనేది ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే 'కాశీ మజిలీ'లో చూడాలి. సుమారు మూడేళ్ళ తర్వాత రేణు దేశాయ్ నటించడం, ఆమె కథ అందించడంతో 'కాశీ మజిలీ'పై ఆసక్తి నెలకొంది. దీనికి డైలాగ్స్ పర్యవేక్షణ:అబ్బూరి రవి, ఛాయాగ్రహణం: రానా, సంగీతం: డా. జోశ్యభట్ల, ఎడిటింగ్: మీర్ ఎస్.

Also Read: Epic Movie Review - 'ఎపిక్' రివ్యూ: 'బేబీ' జంట మళ్ళీ హిట్టు కొట్టిందా? ఆనంద్, వైష్ణవిల సినిమా ఎలా ఉందంటే?

Frequently Asked Questions

'కాశీ మజిలీ' ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది?

'కాశీ మజిలీ' ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక అయిన ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది 'కథా సుధా'లో భాగంగా రూపొందించబడింది.

'కాశీ మజిలీ' ఓటీటీలో ఎప్పుడు విడుదల కానుంది?

'కాశీ మజిలీ' ఎపిసోడ్ ఈటీవీ విన్ ఓటీటీలో సెప్టెంబర్ 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి రేణు దేశాయ్ కథ అందించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు.

'కాశీ మజిలీ' నిర్మాణంలో రేణు దేశాయ్ పాత్ర ఏమిటి?

రేణు దేశాయ్ 'కాశీ మజిలీ'కి కథ, కథనం, సంభాషణలు అందించారు. అంతేకాకుండా, ఆమె ఈ తెలుగు ఓటీటీ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.

'కాశీ మజిలీ' చిత్రానికి దర్శకత్వం ఎవరు వహించారు?

'కాశీ మజిలీ' చిత్రానికి ఆరు వందలకు పైగా యాడ్స్ రూపొందించిన యమునా కిషోర్ దర్శకత్వం వహించారు. దీనిని జెకె ఆర్ట్స్ పతాకంపై జగదీష్ కుమార్ కాళ్ళూరు నిర్మించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Streamings : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు డోంట్ మిస్
Horror Thriller OTT : ఆ 'రాత్రి' ఏం జరిగింది? - ఎక్స్‌క్లూజివ్‌గా మరో హారర్ అంథాలజీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆ 'రాత్రి' ఏం జరిగింది? - ఎక్స్‌క్లూజివ్‌గా మరో హారర్ అంథాలజీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Medical Thriller OTT : మరో ఓటీటీలోకి వచ్చేసిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ - 'కికు చిరంజీవి' ఎందులో చూడొచ్చంటే?
మరో ఓటీటీలోకి వచ్చేసిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ - 'కికు చిరంజీవి' ఎందులో చూడొచ్చంటే?
Crazy Kalyanam OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ కల్యాణం - అనుపమ కొత్త మూవీకి బిగ్ ట్విస్ట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ కల్యాణం - అనుపమ కొత్త మూవీకి బిగ్ ట్విస్ట్... ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget