Kalamkaval OTT: సీరియల్ కిల్లర్‌గా మమ్ముట్టి... ఏ ఓటీటీలో 'కలంకవల్' స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kalamkaval OTT Platform Release Date: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన 'కలంకవల్' త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. మేకర్స్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు.

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా నటించిన మూడు సినిమాలు విడుదల అయ్యాయి. అయితే, వీటన్నింటిలో 'కలంకవల్' ప్రత్యేకంగా నిలిచింది. మరీ ముఖ్యంగా అందులో ఆయన ఒక సీరియల్ కిల్లర్ పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదల ఖరారు అయ్యింది. ఈ సినిమాను ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చో తెలుసుకోండి.
'కలంకవల్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
ఈ సినిమా ఎందులో విడుదల అవుతుంది?
Kalamkaval OTT Platform: 'కలంకవల్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ సోంతం చేసుకుంది. జనవరి 2026 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇంకా ఖచ్చితమైన స్ట్రీమింగ్ తేదీని వెల్లడించలేదు. సినిమా జనవరిలోనే ఓటీటీ విడుదల అవుతుందని స్పష్టంగా చెప్పింది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో అందుబాటులో ఉంటుంది. చాలా మంది ప్రేక్షకులు సినిమా జనవరి మొదటి వారంలోనే విడుదల అవుతుందని ఆశిస్తున్నారు. అయితే అధికారిక తేదీ కోసం ఇంకా వేచి చూడాల్సిందే.
టీజర్ అప్‌డేట్‌తో అభిమానుల్లో ఉత్సాహం
'కలంకవల్' ఓటీటీ విడుదల వార్తను మేకర్స్ ఒక కొత్త టీజర్‌తో ప్రకటించారు. టీజర్‌తో పాటు "లెజెండ్ తిరిగి వచ్చారు. మరింత ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా! మమ్ముట్టి నటన మీ శ్వాసను ఆపేస్తుంది. ఈ సీజన్‌లో అతిపెద్ద బ్లాక్ బస్టర్, కలంకవల్ ఈ జనవరిలో కేవలం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది" అని రాశారు.
Also Read: సీనియర్ ఎన్టీఆర్ to చిరు, పవన్, దళపతి విజయ్ వరకూ... రాజకీయాల్లోకి వెళ్లే ముందు రీమేకులే
View this post on Instagram
'కలంకవల్' నటీనటులు, దర్శకుడు ఎవరంటే?
'కలంకవల్' చిత్రానికి నూతన దర్శకుడు జితిన్ కె. జోస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. 'జైలర్' ఫేమ్ వినాయకన్ కీలక పాత్ర పోషించారు. మమ్ముట్టితో ఆయనకు అనేక తీవ్రమైన సన్నివేశాలు ఉన్నాయి.
'కలంకవల్' బాక్సాఫీస్ కలెక్షన్ ఎంతంటే?
జితిన్ కె. జోస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగాస్టార్ హోమ్ బ్యానర్ మమ్ముట్టి కంపెనీ నిర్మించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 83 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ ఏడాది ప్రణవ్ మోహన్‌లాల్ నటించిన బాక్సాఫీస్ హిట్ 'డీయస్ ఈరై', దుల్కర్ సల్మాన్ నటించిన పాపులర్ సినిమా 'కురుప్' లైఫ్ టైమ్ కలెక్షన్‌లను అధిగమించింది.
Also Read: కన్నడ సీరియల్ నటి నందిన ఆత్మహత్య - సూసైడ్ నోట్‌లో ఏముందంటే?
CLASSIC BLOCKBUSTER OF 2025 🔥
— MammoottyKampany (@MKampanyOffl) December 28, 2025
83+ Crores Worldwide Gross for #Kalamkaval 🔥
We extend our sincere gratitude to audiences across the globe for the overwhelming love and continued support 🙏🤗#Mammootty #MammoottyKampany #JithinKJose @mammukka pic.twitter.com/P4IfxVbsQ0





















