News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

రకుల్ ప్రీత్ సింగ్ 'ఐ లవ్ యు' ట్రైలర్ - రొమాన్స్‌లో సస్పెన్స్!

రకుల్ ప్రీత్ సింగ్, పవిల్ గులాటి జంటగా 'ఐ లవ్ యు' అనే సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్.

FOLLOW US: 
Share:

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తుంది. నిజానికి టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించి స్టార్ ఇమేజ్ ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇటీవల 'చత్రీవాలి' అనే బాలీవుడ్ మూవీ తో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ గానే 'బూ' అనే హారర్ త్రిల్లర్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో మన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా నటించాడు. ప్రముఖ ఓటీటీ జియో సినిమాలో ఈ మూవీ విడుదల కాగా, మొదటిసారి రకుల్ తన కెరీర్ లో 'బూ' మూవీతో హారర్ జోనర్ ని టచ్ చేసింది. అయితే తాజాగా ఈ హీరోయిన్ నటించిన మరో థ్రిల్లర్ నేరుగా ఓటేటి లోనే విడుదల కాబోతోంది. పవిల్ గులాటి, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా 'ఐ లవ్ యు' అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కింది.

నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందింది. అయితే తాజాగా ఈ సినిమాను థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల మూవీ టీం తెలియజేస్తూ రీసెంట్ టీజర్ రిలీజ్ చేయగా. ఈరోజు ట్రైలర్ కూడా విడుదలైంది. ఇక టీజర్ కంటే తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచేసింది. ట్రైలర్లో మొదట హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ, రొమాంటిక్ సీన్స్ ని చూపించిన దర్శకుడు, ఆ తర్వాత ఒక్కసారిగా సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ తో ఆసక్తిని పెంచేశాడు. ముందుగా రకుల్, పవిల్ గులాటి మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ తో ట్రైలర్ మొదలవగా.. ఆ తర్వాత ఉన్నట్టుండి రకుల్ ని ఎవరో ఓ బిల్డింగ్ లో బంధించడం,  ఆ బిల్డింగ్ మొత్తంలో రకుల్ మాత్రమే ఒంటరిగా చిక్కుకోవడాన్ని ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఇంతకీ రకుల్ ని ఎవరు బంధించారు? ఎందుకు బంధించారు? అందుకు సంబంధించి కారణాలు ఏంటి? అనే అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ని అందుకుంటుంది. ఇక ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియా వేదికగా సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "ఐ లవ్ యు మూవీ నేను ఇంతకుముందు చేసిన సినిమాల కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో కథాంశం డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్స్ ని మంచి ఉంటుంది. నిఖిల్ తన రైటింగ్ స్కిల్స్ తో అద్భుతమైన సినిమాని అలాగే నటీనటుల అందరి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకున్నాడు. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ పేర్కొంది. ఇక జూన్ 16న ఈ ఈ మూవీ ప్రముఖ ఓటిటి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ నుండి డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అవుతున్న మూడవ సినిమా ఇది. దీనికంటే ముందు 'ఛత్రివాలి', 'బూ' సినిమాలు నేరుగా ఓటేటిలో రిలీజ్ అయ్యాయి. ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హిందీతో పాటు తమిళంలో 'భారతీయుడు2', 'ఆయాలాన్' సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. వీటిలో 'భారతీయుడు2' షూటింగ్ చివరి దశలో ఉండగా.. 'ఆయాలాన్' ఇటీవలే షూటింగ్ని ప్రారంభించుకుంది.

Published at : 08 Jun 2023 06:37 PM (IST) Tags: Rakul Preet I Love You Trailer I Love You Movie Trailer Rakul Preet Sing I love You Movie I love You Movie On Jio Ciniema

ఇవి కూడా చూడండి

The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్!

The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్!

Upcoming OTT Movies: ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి, ఓటీటీలో ఏకంగా 35కు పైగా చిత్రాల విడుదల

Upcoming OTT Movies: ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి, ఓటీటీలో ఏకంగా 35కు పైగా చిత్రాల విడుదల

RDX OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగులో ఎప్పుడంటే?

RDX OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగులో ఎప్పుడంటే?

DD Returns: తెలుగులో సంతానం తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

DD Returns: తెలుగులో సంతానం తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

Kushi OTT Release Date: 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Kushi OTT Release Date: 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!