అన్వేషించండి

Hey Balwanth OTT : ఓటీటీలోకి సుహాస్ కామెడీ ఎంటర్టైనర్ హే బల్వంత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Hey Balwanth OTT Platform : యంగ్ హీరో సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన రీసెంట్ కామెడీ డ్రామా 'హే బల్వంత్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

Suhas's Hey Balwanth Movie OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ 'హే బల్వంత్'. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ZEE5 సొంతం చేసుకోగా... తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 31 నుంచి సినిమా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ సాధించిన మూవీ ఓటీటీలోనూ అంతే స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.

ఈ మూవీకి గోపీ అచ్చర దర్శకత్వం వహించగా... సుహాస్, శివానీలతో పాటు సీనియర్ హీరో నరేశ్, సుదర్శన్, స్రవంతి, హర్షవర్థన్, వెన్నెల కిశోర్, అజయ్ ఘోష్, అన్నపూర్ణమ్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. త్రిశుల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి నరేంద్ర రెడ్డి నిర్మించగా... వివికే  సాగర్ మ్యూజిక్ అందించారు.

Also Read : గాయపడ్డ సింహం గర్జించే తేదీ ఫిక్స్ - రామ్ చరణ్ పెద్ది రిలీజ్ తర్వాత రోజే... కానీ చిన్న ట్విస్ట్

స్టోరీ ఏంటంటే?

చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన కుర్రాడు కృష్ణ (సుహాస్)... నాన్న రావు బల్వంత్ (నరేశ్), నాన్నమ్మ (అన్నపూర్ణమ్మ) సంరక్షణలోనే పెరుగుతాడు. తన తండ్రిని రోల్ మోడల్‌గా తీసుకున్న కృష్ణ... ఎప్పటికైనా ఆయన చేసే బిజినెస్ టేకోవర్ చేసి తనలా మంచి పేరు తెచ్చుకోవాలని కలలు కంటాడు. చదువు పూర్తైన వెంటనే బిజినెస్ అప్పగించాలంటూ తండ్రిని అడుగుతాడు. అయితే, ముందు నో చెప్పినా... అనుకోని పరిస్థితుల్లో తండ్రి బిజినెస్ టేకోవర్ చేస్తాడు.

తీరా తన తండ్రి చేసే బిజినెస్ గురించి తెలిసి బిగ్ షాక్‌కు గురవుతాడు కృష్ణ. ఒక్కసారిగా లైఫ్ తలకిందులైపోతుంది. ఆ బిజినెస్ కారణంగా ప్రేమించిన అమ్మాయి మిత్ర (శివానీ నాగారం)కు దూరం కావాల్సి వస్తుంది. ఇంతకీ కృష్ణ తండ్రి చేసే బిజినెస్ ఏంటి? దీని వల్ల కృష్ణ ప్రేమకు వచ్చిన ఇబ్బందేంటి? ఆ బిజినెస్ జరిగే చోట మిత్ర తాత చనిపోవడం వల్ల వచ్చిన సమస్యలేంటి? ఆయన శవాన్ని యువన్ (వెన్నెల కిశోర్) ఎందుకు మోయాల్సి వచ్చింది? అతనికి కృష్ణ బిజినెస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Embed widget