అన్వేషించండి

Salaar OTT: ‘సలార్’ ఓటీటీ రిలీజ్ అప్డేట్ - వచ్చే నెల నుంచే స్ట్రీమింగ్!

Salaar OTT Update: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోందని సమాచారం. ఇప్పటికే దీని రిలీజ్ డేట్ గురించి రూమర్స్ కూడా మొదలయ్యాయి.

Salaar OTT Update: చాలాకాలం తర్వాత ప్రభాస్‌కు మాత్రమే కాకుండా తన ఫ్యాన్స్‌కు కూడా ‘సలార్’తో ఊరట లభించింది. తమ ఫేవరెట్ హీరోను తాము ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అలాగే చూపించి ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఫుల్‌గా సంతోషపెట్టాడు ప్రశాంత్ నీల్. ఇక సంక్రాంతికి ఎన్నో సినిమాలు థియేటర్లలో సందడి చేయడంతో ‘సలార్’ జోరు కాస్త తగ్గింది. ఫైనల్‌గా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఏది అని రూమర్స్ వైరల్ అవుతుండగా.. రిలీజ్ డేట్ గురించి కూడా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

‘సలార్’తో ప్రభాస్‌కు హిట్

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే ‘సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్’. ఇప్పటికే ‘కేజీఎఫ్’ చాప్టర్1, చాప్టర్ 2లతో ప్యాన్ ఇండియా వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్‌ను చాలా స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించాడు. అందుకే ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ సినిమా అనగానే లుక్స్ పరంగా తమ హీరోను చాలా స్టైలిష్‌గా చూపిస్తాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్టుగానే మూవీ నుండి విడుదలయిన మొదటి గ్లింప్స్‌తోనే అందరినీ ఆకట్టుకుంది ‘సలార్’. ఫైనల్‌గా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే సమయం వచ్చేసిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

ఓటీటీ రిలీజ్ కోసం వెయిటింగ్

‘సలార్’ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఫిబ్రవరీ 4 నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుందని చర్చలు మొదలయ్యాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ‘సలార్’ స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికీ ‘సలార్’ మేకర్స్ గానీ, నెట్‌ఫ్లిక్స్ గానీ.. ఈ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ దాదాపు ఫిబ్రవరీ 4నే రిలీజ్ డేట్‌గా ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఫిదా అయిపోయిన ఫ్యాన్స్.. మళ్లీ మళ్లీ చూడడానికి థియేటర్లకు వెళ్లారు. ఇక థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మళ్లీ మళ్లీ చూసిన ఫ్యాన్స్ కూడా ఓటీటీలో తమ అభిమాన హీరో సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు.

వారిద్దరి బాండింగ్ హైలెట్

‘సలార్’లో దేవ పాత్రలో ప్రభాస్ కనిపించగా.. తన ప్రాణ స్నేహితుడైన వరద పాత్రలో మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ నటించాడు. సినిమాలో వీరిద్దరి బాండింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వీరితో పాటు జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, ఈశ్వరి రావు.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. ‘కేజీఎఫ్’ రెండు చాప్టర్స్‌కు మ్యూజిక్ అందించిన రవి బాస్రూర్.. ‘సలార్’కు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ‘సలార్’కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. త్వరలోనే ‘సలార్ పార్ట్ 2’ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది వరకు ‘సలార్ పార్ట్ 2’ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్తారని తెలుస్తోంది.

Also Read: ముందే ఫిక్స్ అయ్యా, చివరి సినిమా ఇదే కావచ్చు - మహేశ్ బాబు

టాప్ హెడ్ లైన్స్

Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Emotional Drama OTT : సేవ్ చేసిన డబ్బులతో చిన్నారి ఆశ నెరవేరిందా? - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
సేవ్ చేసిన డబ్బులతో చిన్నారి ఆశ నెరవేరిందా? - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Love Drama OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ - 50 ఏళ్ల వ్యక్తితో యంగ్ అమ్మాయి లవ్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ - 50 ఏళ్ల వ్యక్తితో యంగ్ అమ్మాయి లవ్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Rice Prices: బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
High Tension in Pulivendula: పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Embed widget