Gladiator 2 OTT: ఓటీటీలోకి 3700 కోట్లు కలెక్ట్ చేసిన హాలీవుడ్ యాక్షన్ డ్రామా... సినిమా చూడాలంటే ఓ కండిషన్
Gladiator 2 OTT Platform: రస్సెల్ క్రో హీరోగా రూపొందిన 'గ్లాడియేటర్' కల్ట్ క్లాసిక్ హిట్. ఆ సినిమాకు సీక్వెల్ గా దర్శకుడు రిడ్లీ స్కాట్ తీసిన 'గ్లాడియేటర్ 2' ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.
హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్ 'గ్లాడియేటర్ 2' ఓటీటీలోకి అడుగుపెట్టింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత 'గ్లాడియేటర్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన 'గ్లాడియేటర్ 2' కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో అడుగు పెట్టింది. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్ ఓటీటీ మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అడుగు పెట్టింది. కానీ ఓటీటీలో సినిమాను చూడాలంటే ఒక కండిషన్.
2500 కోట్ల బడ్జెట్ తో...
హాలీవుడ్ హిస్టారికల్ యాక్షన్ మూవీ 'గ్లాడియేటర్ 2' అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. నవంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియాలో తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 24 ఏళ్ల క్రితం అంటే 2000 ఏడాదిలో వచ్చిన 'గ్లాడియేటర్' అనే బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా 'గ్లాడియేటర్ 2' వచ్చింది. ఈ సీక్వెల్ కోసం దాదాపు 310 మిలియన్ డాలర్లు... ఇండియన్ కరెన్సీ లో చూసుకుంటే రూ. 2500 కోట్లు పెట్టి, ఈ సినిమాను డైరెక్టర్ రిడ్లీ స్కాట్ రూపొందించారు. సుమారు 3700 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీలో పాల్ మెస్కల్, డేంజిల్ వాషింగ్టన్, పెడ్రో పాస్కల్ కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉండగా తాజాగా 'గ్లాడియేటర్ 2' మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగు పెట్టింది. థియేటర్లలో రిలీజ్ అయిన 45 రోజుల తర్వాత 'గ్లాడియేటర్ 2' ఓటీటీ స్ట్రీమింగ్ మొదలైంది. కానీ ఈ మూవీని అందరూ చూడలేరు. ఎందుకంటే ఈ సినిమా రెంటల్ బేసిస్ లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రూ. 389 రెంట్ బేసిస్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీని ఫ్రీగా ఎప్పుడు ఓటీటీలో చూడవచ్చు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: 'అన్‌స్టాపబుల్ 4' షో కోసం రామ్ చరణ్ వేసుకున్న హుడీ కాస్ట్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
ఇండియాలో కలెక్షన్స్
ఇక ఈ సినిమా స్టన్నింగ్ విజువల్స్ తో అదిరిపోయే యుద్ధ సన్నివేశాలతో థియేటర్లలో పర్లేదనిపించింది. ఈ సీక్వెల్ లో రోమ్ చక్రవర్తులపై తనను బంధించినందుకు మాక్రిసన్ తో కలిసి లూసియస్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే విషయాన్ని చూపించారు. సినిమాలో ఓవైపు యాక్షన్ సన్నివేశాలను చూపిస్తూనే మరోవైపు అధికారం కోసం రోమ్ లో జరిగిన కుట్రలు, కుతంత్రాలు వంటి విషయాలను ఆసక్తికరంగా చూపించారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రేమ కథ కూడా ఉంటుంది. థియేటర్లలో రన్ అవుతున్న సమయంలో 'గ్లాడియేటర్ 2' భారతదేశంలో మొత్తం రూ.11.74 కోట్లు రాబట్టింది.
త్వరలో 'గ్లాడియేటర్ 3' కూడా...
2000లలో తెరపైకి వచ్చిన 'గ్లాడియేటర్' మూవీ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఏకంగా 5 ఆస్కార్ అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది. అయితే 24 ఏళ్ల తర్వాత ఈ కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్ గా 'గ్లాడియేటర్-2' తెరపైకి వచ్చినా, పెద్దగా అంచనాలను అందుకోలేకపోయింది. కానీ 'గ్లాడియేటర్ 2'కి మరో సీక్వెల్ 'గ్లాడియేటర్ 3' కూడా ఉండబోతుందని ఇప్పటికే డైరెక్టర్ రిడ్లీ ఇప్పటికే ప్రకటించారు.
Also Read: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ సూపర్ స్టార్... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్