Keechurallu OTT: థియేటర్లలో విడుదలైన రెండేళ్లకు తెలుగు ఓటీటీలోకి వస్తున్న మలయాళ థ్రిల్లర్- ఎందులో, ఎప్పుడు చూడాలంటే?
Rajisha Vijayan: రజిషా విజయన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళం మూవీ ‘కీడం‘ తెలుగులో ‘కీచురాళ్ళు‘ పేరుతో విడుదలకు రెడీ అవుతోంది. ఈ మూవీ ఈటీవీ విన్ వేదికగా మే 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

Keedam Telugu Dubbing OTT Release: కేరళ బ్యూటీ రజిషా విజయన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళీ చిత్రం ‘కీడం‘. రాహుల్ రిజీ నాయర్ దర్శకత్వం వహించిన ఈ సైబర్ థ్రిల్లర్... 2022లో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. మలయాళంలో థియేటర్లలో విడుదలైన రెండేళ్లకు తెలుగులో విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రాన్ని ‘కీచురాళ్లు‘ పేరుతో తెలుగులో డబ్బింగ్ చేశారు. ఆ వెర్షన్ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా మే 30 నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ‘కీచురాళ్ళు‘ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
‘కీచురాళ్లు‘ సినిమా కథ ఏంటంటే?
‘కీచురాళ్ళు‘ సినిమాలో రజిషా విజయన్‌తో పాటు శ్రీనివాసన్, విజయ్ బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో రాజీషా సైబర్ సెక్యూరిటీ నిపుణురాలిగా కనిపించింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... రాధికా బాలన్ (రజిషా విజయన్) ఓ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ సంస్థను ప్రారంభిస్తుంది. సైబర్ క్రైమ్ కు సంబంధించిన కేసులను పరిష్కరించడంలో బాధితులతో పాటు పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తుంది. అనుకోకుండా ఓసారి ఆమే సైబర్ క్రైమ్ బాధితురాలిగా మారిపోతుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంటాడు. ఇంతకీ అతడు ఎవరు? ఆమెను ఎందుకు బెదిరించాడు? తన తెలివితో అతడిని ఎలా పట్టుకుంది? అనేది ఈ సినిమాలో చూపించారు. సైబర్ మోసాల వలలో మహిళలలు ఎలా చిక్కుకుంటున్నారు? అనే విషయాన్ని దర్శకుడు ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఈ మూవీపై పలువురు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.
నటనా ప్రాధాన్యత ఉన్న చిత్రాలతో మంచి గుర్తింపు
రజిషా విజయన్ రొటీన్ పాత్రలు కాకుండా, నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లోనూ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు రజిషా 20కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తమిళంలో సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్‘ సినిమాలో అద్భుత నటనతో ఆకట్టుకుంది. ‘లవ్‘, ‘మధురమనోహర మోహన్‘, ‘మలయాన్ కుంజు‘ సహా పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ ఆమె ఓ సినిమా చేసింది. రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ‘ సినిమలో కనిపించింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో తెలుగులో మరే సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు ‘కీచురాళ్ళు‘ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఆమెకు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.
View this post on Instagram
Read Also: ‘గం గం గణేశా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్!
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















