అన్వేషించండి

Eesha OTT : మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?

Horror Thriller OTT : గతేడాది ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన హారర్ థ్రిల్లర్ ఈషా మరో ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Hebah Patel's Eesha OTT Streaming : హారర్, థ్రిల్లర్ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓటీటీ సంస్థలు సైతం అలాంటి కంటెంట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్‌లను ఎక్కువగా స్ట్రీమింగ్ చేస్తున్నాయి. తాజాగా మరో హారర్ థ్రిల్లర్ ఆడియన్స్‌ను అలరించేందుకు మరో ఓటీటీలోకి వచ్చేసింది.

ఏ మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన హారర్ థ్రిల్లర్ 'ఈషా' (Eesha). డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా... దాదాపు 7 నెలల తర్వాత మరో ఓటీటీ జియో హాట్ స్టార్ (Jio Hotstar)లో అందుబాటులోకి వచ్చింది. అయితే, హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే మిగిలిన భాషల్లోనూ స్ట్రీమింగ్ కావొచ్చు.

ఈ మూవీకి శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించగా... త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే, పృథ్వీరాజ్, మైమ్ మధు తదితరులు కీలకపాత్రలు పోషించారు. కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు.

Also Read : Madhurapuri Sadhana OTT : ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

స్టోరీ ఏంటంటే?

కల్యాణ్ (త్రిగుణ్), వినయ్ (అఖిల్ రాజ్), అపర్ణ (సిరి హనుమంతు), నయన (హెబ్బా పటేల్) చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఆత్మలు, దెయ్యాలు లేవని బలంగా నమ్ముతుంటారు. మూఢ నమ్మకాల పేరుతో జనాల్ని దోచుకుంటున్న బురిడీ బాబాలు, అమాయకుల చావులకు కారణమయ్యే దొంగ స్వామీజీల ఆట కట్టించడమే పనిగా పెట్టుకుని వారి మోసాల గురించి జనాలకు తెలిసేలా చేస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో ఉండే ఆది దేవ్ (పృథ్వీరాజ్) బాబా గురించి తెలుస్తుంది.

అతని ఆట కట్టించేందుకు నలుగురు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్లగా... ఆత్మలున్నాయని నిరూపిస్తానంటూ వారికి సవాల్ విసురుతాడు ఆది దేవ్. అందులో భాగంగా ఓ పాడుబడిన బంగ్లాలో మూడు రోజులు ఉండాలని అంటాడు. అందుకు నలుగురూ సిద్ధమవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? బంగ్లాలో వారికి ఎదురైన భయానక అనుభవాలేంటి? ఆ బంగ్లాలో ఆత్మలున్నాయా? వీరిపై పగ పట్టిన ఓ ఆత్మ నుంచి ఆది దేవ్ వీరిని ఎలా కాపాడాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Azadi 501 Series OTT : ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Part Timers Series OTT : ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Oh Sukumari OTT : ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ
ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ
Vanda Devullu OTT: వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Dhandha Review - 'దందా' వెబ్ సిరీస్ రివ్యూ: ఛాయ్ షాట్స్‌లో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
'దందా' వెబ్ సిరీస్ రివ్యూ: ఛాయ్ షాట్స్‌లో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget