Meerpet Murder Case : మీర్ పేట హత్య కేసులో మర్డర్ ప్లాన్ చేయడానికి కారణమైన 'సూక్ష్మ దర్శిని' మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?
Meerpet Murder Case : సంచలనం సృష్టించిన మీర్ పేట హత్యను ప్లాన్ చేయడానికి కారణమైన 'సూక్ష్మ దర్శిని' మూవీ తెలుగులో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

Sookshmadarshini Streaming on this OTT : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్ పేట్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గురుమూర్తి తన భార్యను హత్య చేసి, ఆ మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో ఏకంగా ఓ సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యానని పోలీసుల విచారణలో వెల్లడించారు. అచ్చం సినిమాలో ఉన్నట్టే ఫాలో అవుతూ పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు.
రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో కలకలం రేపిన వెంకట మాధవి హత్య కేసు మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది. మాజీ సైనిక ఉద్యోగి అయిన గురుమూర్తి ఈ నెల 15న తన భార్య వెంకట మాధవిని హత్య చేశాడు. హత్య తర్వాత భార్య మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో 'సూక్ష్మదర్శిని' మూవీని చూసి, సినిమాలో చేసినట్టే చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, వేడి నీళ్లలో ఉడికించి, దగ్గర్లోని చెరువులో విసిరేసాడు. అయితే ఈ మర్డర్ ను పక్కాగా ప్లాన్ చేశాడు.
ఏకంగా తన భార్యను ముక్కలుగా కట్ చేసి, ఆ తర్వాత ఉడకబెట్టి, స్టవ్ మీద కాల్చాడు. కానీ ఆ టైంలో స్మెల్ పక్కింట్లోకి కూడా రాకుండా ఉండడానికి కొన్ని రసాయనాలను వాడినట్టు సమాచారం. ఇదంతా రీసెంట్ గా రిలీజ్ అయిన 'సూక్ష్మ దర్శిని' అనే మలయాళ సినిమాను చూసి చేశానని నిందితుడు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మొత్తం అదే రీతిలో జరగకపోయినా, బాధితురాలిని ముక్కలుగా కట్ చేయడం, స్మెల్ రాకుండా ఏర్పాటు చేసుకోవడం వంటివన్నీ ఈ సినిమాలో చూడొచ్చు. మరి ఈ 'సూక్ష్మదర్శిని' మూవీ ఇప్పుడు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా ?
ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్
సూక్ష్మ దర్శిని మూవీ ఒక మలయాళ థ్రిల్లర్. దాదాపు 5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ నవంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయి, ఏకంగా 55 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో బేసిల్ జోసెఫ్, నజ్రియా నాజిమ్ లీడ్ రోల్స్ పోషించారు. ఈ థ్రిల్లర్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో జనవరి 11 నుంచి మలయాళం, తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
'సూక్ష్మదర్శిని' స్టోరీ ఇదే...
ప్రియా అనే అమ్మాయి తన భర్త, పాపతో హౌస్ వైఫ్ గా సంతోషంగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. ప్రియా పక్కింట్లోకి అనారోగ్యం బారిన పడిన తన తల్లితో పాటు దిగుతాడు మ్యాన్యువల్. నిజానికి వాళ్ల సొంతూరు, సొంత ఇల్లు అది. సొంతూరు కాబట్టి తల్లి త్వరగా కొలుకోవాలని ఇక్కడికి వచ్చామని మాన్యువల్ చెప్తాడు. కానీ కొన్ని రోజుల తర్వాత మాన్యువల్ ప్రవర్తన వింతగా ఉన్నట్టు ప్రియా కనిపెడుతుంది. ఇదే విషయాన్ని భర్త దగ్గర ప్రస్తావిస్తే ఆయన అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కోప్పడతాడు. కానీ ఒక్కసారి అనుమానం వచ్చిందంటే, దాని అంతు తేల్చేదాక నిద్రపోదు ప్రియ.
ఓ రోజు రాత్రి సడన్ గా మాన్యువల్ తల్లి మిస్ అవుతుంది. అయితే తర్వాత ఆమె కనిపించడంతో, తన తల్లికి మతిమరుపు ఉందని చెప్తాడు మ్యాన్యువల్. కానీ ప్రియా మాత్రం ఆమెకు అసలు అల్జీమర్స్ లేదని, వాళ్ళింట్లో ఏదో తేడాగా జరుగుతోందని అనుమాన పడుతుంది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ మ్యాన్యువల్ తల్లి కనిపించకుండా పోతుంది. మరి ఆమె తిరిగి దొరికిందా? మాన్యువల్ ఇంట్లో ప్రియా అనుమాన పడుతున్నట్టుగా ఏం జరుగుతోంది? చివరికి అసలు విషయాన్ని బయట పెట్టడానికి ప్రియా ఏం చేసింది? అనేది చూసి తెలుసుకోవాల్సిందే.
Also Read: పద్మ భూషణ్ బాలకృష్ణ కోసం... ఈసారైనా అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?





















