Dies Irae OTT : మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Dies Irae OTT Platform : రీసెంట్ మలయాళ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' మరో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. 3 భాషల్లోనే అందుబాటులోకి రాగా 2 ఓటీటీల్లో మూవీ చూడొచ్చు.

Pravan Mohanlal's Dies Irae OTT Streaming : మలయాళ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మూవీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా మరో ఓటీటీలోకి కూడా అందుబాటులోకి వచ్చింది.
2 ఓటీటీల్లో స్ట్రీమింగ్... అయితే...
ఈ మూవీ ప్రస్తుతం జియో హాట్ స్టార్‌లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. తాజాగా NRIల కోసం మరో ఓటీటీలోకి కూడా అందుబాటులోకి వచ్చింది. భారత్ కాకుండా ఇతర దేశాల్లో ఉండే ఆడియన్స్ కోసం ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్'లోనూ శనివారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తమిళం, తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
View this post on Instagram
Also Read : ప్రభాస్ 'ది రాజా సాబ్' ఓటీటీ డీల్ క్లోజ్! - బిగ్ డీల్ సాబ్... ఈ ట్విస్ట్ నిజమేనా?
ఈ మూవీకి 'భ్రమ యుగం', 'భూతకాలం' మూవీస్ తీసిన రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించగా... ప్రణవ్ మోహన్ లాల్‌తో పాటు సుస్మితా భట్, జిబిన్ గోపీనాథ్, జయ కురుప్, అరుణ్ అజికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ మూవీని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీ స్రవంతి మూవీస్ అధినేత కిశోర్ రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన 6 రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది మూవీ.
స్టోరీ ఏంటంటే?
ఫ్రెండ్స్‌తో సరదాగా లైఫ్ ఎంజాయ్ చేసే ఆర్కిటెక్ట్ రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్). అతని తండ్రి ఓ పెద్ద బిజినెస్ మ్యాన్. పేరెంట్స్ అమెరికాలో ఉంటే రోహన్ ఇక్కడే ఉండి చదువుకుంటాడు. ఓ రోజు పార్టీ చేసుకుంటుండగా తన క్లాస్ మేట్ కణి (సుస్మితా భట్) ఆత్మహత్య చేసుకుందని స్నేహితుడి ద్వారా తెలుసుకుంటాడు. ఆ తర్వాతి రోజే వారి ఇంటికి వెళ్లి పరామర్శిస్తాడు. కణి గుర్తుగా ఓ హెయిర్ క్లిప్‌ను ఇంటికి తీసుకొస్తాడు.
ఆ రోజు రాత్రి ఇంట్లో ఊహించని పరిస్థితులు అతనికి ఎదురవుతాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతన్ని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. తన లైఫ్‌లో జరగకూడని ఘటనలు చూసిన రోహన్ కణి పక్కింట్లో ఉండే మధు (జిబిన్ గోపీనాథ్) సాయం కోరతాడు. అలా వారు వివరాలు తెలుసుకునే లోపే కణి తమ్ముడు మేడ మీద నుంచి పడతాడు. అసలు రోహన్ ఇంట్లో ఏం జరుగుతోంది? కణి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి? కణి ఆత్మే రోహన్‌ను వెంటాడుతుందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















