Meenakshi Chaudhary : టాలీవుడ్ హీరోతో హీరోయిన్ మీనాక్షి చౌదరి పెళ్లి! - క్లారిటీ ఇచ్చిన టీం
Meenakshi Chaudhary : స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తోన్న వార్తలకు చెక్ పడింది. ఈ రూమర్స్‌పై హీరోయిన్ టీం ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

Clarity About Actress Meenakshi Chaudhary Marriage Rumours : స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పెళ్లిపై గతంలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె టాలీవుడ్ హీరో సుశాంత్‌ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీనిపై గతంలోనే ఆమె క్లారిటీ ఇచ్చారు. అదంతా ఫేక్ న్యూస్ అని... వాటిల్లో నిజం లేదని అన్నారు. అయినా కూడా రూమర్స్ మాత్రం ఆగలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొందరు వైరల్ చేస్తూనే ఉన్నారు.
హీరోయిన్ టీం క్లారిటీ
గత రెండు రోజులుగా కొన్ని మీమ్ పేజీల్లో సుశాంత్, మీనాక్షి చౌదరి పెళ్లి వార్తలు మళ్లీ హల్చల్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగబోతోందంటూ ప్రచారం సాగుతుండగా... హీరోయిన్ టీం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. వారిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని... పెళ్లి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పింది. దయచేసి ఇకపై ఇలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని తెలిపింది.
గతంలో ఇద్దరూ కలిసి ఓ ఎయిర్ పోర్టులో కనిపించగా... పెళ్లి అంటూ వార్తలు రాసేయగా... దీనిపై ఆమె స్వయంగా వివరణ ఇచ్చారు. మీనాక్షి చౌదరి, సుశాంత్ కలిసి 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే మూవీలో నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి కనిపించినా పెళ్లి అనే రూమర్స్ వచ్చేశాయి. తాజాగా, ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
Also Read : బాహుబలికి రాజమౌళి లెటర్ - డార్లింగ్ ఇప్పటికే నీకు తెలిసింది కదా...
ఇక సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బిగ్ సక్సెస్ అందుకున్నారు మీనాక్షి. ప్రస్తుతం, నాగచైతన్యతో మైథలాజికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'లో హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ మూవీకి 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తుండగా... ఆర్కియాలజిస్ట్ 'దక్ష'గా నటిస్తున్నారు మీనాక్షి. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్ అదిరిపోయింది.






















