Clap Movie Trailer Release: డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన ఆది పినిశెట్టి 'క్లాప్', రేపే ట్రైలర్ రిలీజ్
ఆది పినిశెట్టి హీరోగా నటించిన 'క్లాప్' మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఏ ఓటీటీలో సినిమా విడుదల కానుంది? ఇతర వివరాలు ఏమిటి? అనే అంశాల్లోకి వెళితే...
![Clap Movie Trailer Release: డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన ఆది పినిశెట్టి 'క్లాప్', రేపే ట్రైలర్ రిలీజ్ Clap Movie OTT Release Confirmed, Aadhi Pinisetty Aakanksha Singh starrer Clap Movie ready for direct OTT release in Sony Liv Clap Movie Trailer Release: డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన ఆది పినిశెట్టి 'క్లాప్', రేపే ట్రైలర్ రిలీజ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/04/6ea58b08a58d525756870fa94db076cc_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆది పినిశెట్టి... అంచనాలకు అందని నటుడు. హీరోగా సినిమాలు చేస్తారు. విలన్ వేషాలు వస్తే నటుడిగా వైవిధ్యం చూపిస్తారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తారు. అందుకే, ఆయన్ను అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళకు ఓ న్యూస్. ఆది పినిశెట్టి హీరోగా నటించిన 'క్లాప్' మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది.
స్పోర్ట్స్ డ్రామాగా 'క్లాప్' మూవీని రూపొందించారు. ఇందులో హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ ఆకాంక్షా సింగ్ అథ్లెట్స్‌గా కనిపించనున్నారు. ఆది రన్నర్ అయితే... ఆకాంక్షా సింగ్ హాకీ ప్లేయర్. వీళ్లిద్దరి మధ్య ప్రేమ, హీరో జీవితంలో సంఘర్షణ వంటి అంశాలతో సినిమా తెరకెక్కింది. త్వరలో సోనీ లివ్ ఓటీటీలో సినిమా డైరెక్ట్ రిలీజ్ కానుంది.
"పట్టుదల, ధైర్యం, కృషి... ఇవన్నీ ఆయుధాలుగా మార్చుకొని పరుగు మొదలు పెట్టిన విష్ణు జర్నీని చూసేయండి" అని సోనీ లివ్ ఓటీటీ పేర్కొంది. ఆది పినిశెట్టి ఆ ట్వీట్ రీట్వీట్ చేశారు. శనివారం (Clap Movie Trailer Release) ట్రైలర్ విడుదల చేయనున్నారు.
Also Read: 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' రివ్యూ: ఫస్టాఫ్ హిట్టు - సెకండాఫ్ గురించి మీకు అర్థమవుతోందా?
రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వీ ఆదిత్య దర్శకుడిగా బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిరిడీ సాయి మూవీస్ సంయుక్తంగా సినిమాను తెరకెక్కించాయి. ఐబి కార్తికేయన్, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో నాజర్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ తదితరులు నటించగా... మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.
Also Read: 'సెబాస్టియన్ పీసీ 524' రివ్యూ: సెబాగా కిరణ్ అబ్బవరం కామెడీ బావుంది కానీ
పట్టుదల☑️
— SonyLIV (@SonyLIV) March 4, 2022
ధైర్యం☑️
కృషి☑️
ఇవన్నీ ఆయుధాలుగా మార్చుకొని పరుగు మొదలుపెట్టిన విష్ణు జర్నీని చూసేయండి. #TrailerFromTomorrow #ClapStreamingSoonOnSonyLIV@AadhiOfficial @ilaiyaraaja @aakanksha_s30 @actorbrahmaji @prakashraaj @KurupKrisha @prithivifilmist @BigPrintOffl @SRCOffl pic.twitter.com/aSt14kzuKt
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)