అన్వేషించండి

Blast Zone OTT Release : బ్లాస్ట్ జోన్ ఓటీటీ రిలీజ్ డేట్ - అర్జున్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

Blast Zone OTT Platform : యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ బ్లాస్ట్ జోన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. దాదాపు నెల రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

Arjun's Blast Zone OTT Release Date Locked : చాలా రోజుల తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ బ్లాస్ట్ జోన్. మే 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. వరల్డ్ వైడ్‌గా రూ.60 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దాదాపు నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

బ్లాస్ట్ జోన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా... జూన్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీకి సుభాష్ కె రాజ్ దర్శకత్వం వహించగా... అభిరామి, కన్నప్ప ఫేం ప్రీతి ముకుందన్ కీలకపాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరమ్, ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ సంయుక్తంగా నిర్మించారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు.

Also Read : IKKA OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి ధురంధర్ విలన్ మూవీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

స్టోరీ ఏంటంటే?

మధ్య తరగతి అమ్మాయి నీల (ప్రీతి ముకుందన్) కరాటే స్పెషలిస్ట్. తండ్రి రాజారామ్ (అర్జున్), తల్లి (అభిరామి) కూడా కరాటే మాస్టర్లే. వీరి ఫ్యామిలీ పిల్లలకు ఉచితంగా మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ ఇస్తూనే... మరోవైపు మెడికల్ షాప్ నిర్వహిస్తుంటారు. నీల కూడా జాబ్ చేస్తూ తండ్రికి చేదోడుగా ఉంటుంది. జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న టైంలో ఊహించని ఘటన జరుగుతుంది. ఓ రోజు ఆమె షాపులో ఉండగా... కృపాకర్ (పవన్) గ్యాంగ్‌కు చెందిన ఓ రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లేందుకు యత్నిస్తాడు.

అయితే, కరాటే స్పెషలిస్ట్ అయిన నీల అతన్ని చితక్కొట్టి పోలీసులకు అప్పగిస్తుంది. ఆ రౌడీ అలా అరెస్ట్ అయ్యాక కృపాకర్ గ్యాంగ్‌తో పాటు మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబంరం) నీల ఫ్యామిలీని అంతం చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? కృపాకర్ గ్యాంగ్ వీరి ఫ్యామిలీని ఎందుకు అంతం చేయాలని చూసింది? ఈ వ్యవహారానికి ఫేమస్ బిజినెస్ మ్యాన్ వరుణ్ దయాలన్‌కు ఉన్న సంబంధం ఏంటి? క్రిమినల్ గ్యాంగ్ నుంచి రాజారామ్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Sing Geetham Collections Day 2: సింగ్ గీతం కలెక్షన్లు... పాజిటివ్ టాక్‌తో రెండో రోజు భారీ జంప్ - టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget