Bachchan Pandey OTT Release: అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే' ఓటీటీ రిలీజ్ ఈ వారమే
అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన 'బచ్చన్ పాండే' సినిమా ఈ వారమే ఓటీటీలో విడుదల కానుంది.
బాలీవుడ్ 'ఖిలాడి' అక్షయ్ కుమార్ కథానాయకుడిగా రూపొందిన హిందీ సినిమా 'బచ్చన్ పాండే'. మార్చి 18న థియేటర్లలో విడుదలైంది. నెల తిరక్కుండానే ఓటీటీలోకి వస్తోంది. 'బచ్చన్ పాండే' సినిమాను ఏప్రిల్ 15 (ఈ శుక్రవారం) నుంచి తమ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ ప్రైమ్ వీడియో వెల్లడించింది.
థియేటర్లలో 'బచ్చన్ పాండే' సినిమాకు ఆశించిన రీతిలో ఆదరణ దక్కలేదు. 'ద కాశ్మీరీ ఫైల్స్'కు అప్పటికే థియేటర్లలో ఉంది. ఆ చిత్రానికి విపరీతమైన ఆదరణ లభించింది. ఆ సినిమా ముందు 'బచ్చన్ పాండే' వెలవెలబోయింది. ఇక, అక్షయ్ కుమార్ సినిమా విడుదలైన వారం తర్వాత 'ఆర్ఆర్ఆర్' థియేటర్లలోకి రావడంతో ఆ సినిమా ఎఫెక్ట్ కూడా పడింది. థియేటర్లలో 'బచ్చన్ పాండే'ను ఎక్కువ మంది చూడలేదు. ఇప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది.
View this post on Instagram
Also Read: కండోమ్స్‌కు నిధి అగర్వాల్ ప్రచారం - సోషల్ మీడియాలో దుమ్ము దుమారం
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన తమిళ హిట్ 'జిగర్తాండ'కు హిందీ రీమేక్ 'బచ్చన్ పాండే'. తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'గద్దలకొండ గణేష్' సినిమాకూ 'జిగర్తాండ' ఆధారం! తెలుగులో హరీష్ శంకర్ కొన్ని మార్పులు చేశారు. హిందీలోనూ కొన్ని మార్పులు చేశారు. తెలుగులో అథర్వ చేసిన పాత్రను హిందీలో ఫిమేల్ క్యారెక్టర్ చేశారు. కృతి సనన్ ఆ రోల్ చేశారు.
Also Read: ఏప్రిల్ రెండో వారంలో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు