Baby John OTT : కీర్తి సురేష్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ 'బేబీ జాన్' ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా ?
Baby John OTT Platform : వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'బేబీ జాన్' ఓటీటీ పార్టనర్ అప్డేట్ వచ్చేసింది.
Baby John OTT Release Date : బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం 'బేబి జాన్'. నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ మూవీతోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. కలీస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చాలా కాలం క్రితమే వచ్చిన కోలీవుడ్ మూవీ 'తెరి'కి రీమేక్. ఇందులో బాలీవుడ్ నటి మరో హీరోయిన్ గా నటించింది. ఇందులో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో మెరవబోతుండడం విశేషం. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అప్డేట్ వచ్చేసింది.
'బేబీ జాన్' డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
కీర్తి సురేష్ మొట్టమొదటిసారి ఈ 'బేబీ జాన్' సినిమాతో హిందీలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. దీంతో ఈ సినిమాపై సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా పెళ్లయిన ఈ అమ్మడు మెడలో పసుపు తాడుతో 'బేబీ జాన్' సినిమా ప్రమోషన్లలో మెరిసి, సినిమా పట్ల తనకున్న ప్యాషన్ ను చూసి అందరూ ముచ్చట పడేలా చేసింది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను సినీ 1 స్టూడియోస్, జియో స్టూడియోస్ బ్యానర్లపై ప్రియా అట్లీ నిర్మించారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. ట్రైలర్ తోనే ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మూవీ ఉండబోతుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ మూవీ ఓటీటీ డీల్ కూడా భారీ ధరకు జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ 2025 జనవరి చివరి వారంలో కానుందని బీ టౌన్ లో టాక్ నడుస్తోంది. 'బేబీ జాన్' మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ అయితే ఫిక్స్ అయ్యింది. కానీ ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు రాబోతోంది ? అనే విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
'బేబీ జాన్' ట్విట్టర్ టాక్
'బేబీ జాన్' మూవీకి ఫస్ట్ షో తోనే మిక్స్డ్ టాక్ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా సినిమాను చూసినవారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో యాక్షన్, డ్రామా, ఎమోషన్స్, కామెడీ, రొమాన్స్ అన్నీ ఉన్నాయని, సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక మొదటి నలభై నిమిషాల పాటు మూవీ డీసెంట్ గా ఉంటుందని, ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు అయితే హైలెట్ అంటున్నారు. సెకండ్ హాఫ్ లో హై వోల్టేజ్ యాక్షన్స్ సీన్స్ ఉండగా, క్లైమాక్స్, తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుందని టాక్ నడుస్తోంది.