Aparadhi OTT Release Date: తెలుగు ఓటీటీలోకి 'పుష్ప 2' విలన్ హారర్ థ్రిల్లర్ 'అపరాధి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Aparadhi OTT Platform: మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ హారర్ థ్రిల్లర్ 'ఇరుళ్' తెలుగులో 'అపరాధి'గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఓటీటీ 'ఆహా' ఈ మూవీ అందుబాటులోకి రానుంది.

Fahadh Faasil's Aparadhi OTT Release On Aha: హారర్, క్రైమ్ కంటెంట్‌కు ఓటీటీ ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్న క్రమంలో ప్రముఖ ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్‌నే అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ హారర్ థ్రిల్లర్ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), సౌబిన్ షాహిర్ (Soubin Shahir), దర్శనా రాజేంద్రన్ (Darshana Rajendran) ప్రధాన పాత్రల్లో నటించిన మిస్టరీ హారర్ థ్రిల్లర్ 'ఇరుళ్' (Irul). ఇప్పటికే మలయాళంలో ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా.. తెలుగులో 'అపరాధి' (Aparadhi) అనే టైటిల్‌తో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
ఈ నెల 8 నుంచి ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో అందుబాటులోకి రానుంది. రన్ టైం కేవలం గంటన్నర మాత్రమే. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా 'ఆహా' (Aha) వెల్లడించింది. 'ఒక ఇల్లు.. ముగ్గురు వ్యక్తులు.. అంతులేని అనుమానం.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ మూవీకి నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించగా.. కొవిడ్ టైంలో మలయాళంలో నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. సునీల్ యాదవ్ కథ అందించారు.
View this post on Instagram
Also Read: మెగా ఫ్యామిలీ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది - ఫోటోతో విషయం చెప్పిన వరుణ్ తేజ్ - లావణ్య దంపతులు
స్టోరీ ఏంటంటే?
అలెక్స్ (సౌబిన్ షాహిర్) ఓ పెద్ద వ్యాపారవేత్త. అప్పుడప్పుడూ నవలలు రాస్తుంటాడు. ఓ వీకెండ్‌లో తన ప్రియురాలు అర్చన పిళ్లై (దర్శనా రాజేంద్రన్)తో కలిసి టూర్ ప్లాన్ చేస్తాడు. అలా వారిద్దరూ కలిసి ఓ ప్లేస్‌కు వెళ్తుండగా కారు బ్రేక్ డౌన్ అవుతుంది. ఇదే టైంలో వర్షం సైతం ప్రారంభం అవుతుంది. ఇంతలో వారు ఆశ్రయం కోసం చూస్తుండగా.. సమీపంలోని ఓ ఇంటికి వెళ్తారు. ఆ ఇంటి ఓనర్ ఉన్ని (ఫహాద్ ఫాజిల్) వారికి ఆశ్రయం ఇస్తాడు. ఆ ఇంట్లో తనకు ఎదురైన సంఘటనలన్నీ తాను రాసిన ఓ నవలలో రాసినట్లే జరుగుతాయి. దీంతో అలెక్స్ ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో అర్చనకు అలెక్స్ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. ఆ ఇంట్లో ఓ డెడ్ బాడీని సైతం గుర్తిస్తుంది. మరి అర్చనకు తెలిసిన నిజాలేంటి?, ఆ మృతదేహం ఎవరిది?, ఆ మర్డర్ చేసింది ఎవరు? వంటివి తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















