News
News
X

Best OTT Movies: ఓటీటీలో థ్రిల్లింగ్ సినిమాలు చూడాలని ఉందా? ఈ మూవీస్ మీకు నచ్చేస్తాయ్

ఈ మధ్య కాలంలో ఓటీటీల వేదికగా చాల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిల్లో మంచి హిట్ టాక్ ను అందుకున్న కొన్ని సినిమాలను ఇక్కడ సూచిస్తున్నాము.

FOLLOW US: 
Share:

ఓటీటీల్లో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే, వీటిలో ఏ మూవీస్ నచ్చుతాయో చెప్పలేం. ముఖ్యంగా మీకు థ్రిల్లింగ్ వెబ్ సీరిస్‌లు చూడాలని ఉంటే.. ఈ లిస్టులో పేర్కొన్న సినిమాలను ట్రై చేయండి. వీటిలో కొన్ని థ్రిల్ మాత్రమే కాదు.. భావోద్వేగానికి కూడా గురిచేస్తాయి. 

ఒకప్పుడు సినిమాలు నేరుగా థియేటర్లలోనే విడుదల అయ్యేవి. అయితే ప్రస్తుతం ఓటీటీల పుణ్యమా అని వెబ్ సిరీస్ లతో పాటు చిన్న చిన్న సినిమాలు కూడా డిజిటల్ వేదికగా విడుదల అవుతున్నాయి. అలా రిలీజ్ అయిన సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్లలో రన్ టైమ్ తర్వాత ఆ సినిమాలు నేరుగా ఓటీటీలలో కూడా విడుదల చేస్తున్నారు. అంతే కాకుండా ఓటీటీ లు వచ్చాక భాషాభేదాలు కూడా తగ్గి అన్ని భాషల సినిమాలను చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ మధ్య కాలంలో ఓటీటీల వేదికగా చాల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిల్లో సీట్ ఎడ్జ్‌న కూర్చొబెట్టే కొన్ని చిత్రాల జాబితాను ఇక్కడ ఇస్తున్నాం. అవేంటో చూసేయండి. 

1. వాల్వి(మరాఠి)

పరేష్ మాక్షి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రజెంట్ ఓటీటీ మూవీలలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ మూవీలో స్వప్నిల్ జోషి, అనితా డేట్, సుభేద్ భవే, శివాని శర్వే ప్రధాన పాత్రలలో నటించారు. ఇది ఒక సీరియస్ క్రైమ్ చుట్టూ తిరిగే డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ. మొదట్నుంచీ చివరి వరకూ ఎంగేజ్ చేసే విధంగా స్టోరీ ఉంటుంది. ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది.

2. దాదా(తమిళ్)

గణేష్ కె బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో మంచి టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీలో అపర్ణ దాస్, కవిన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఓ ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ లవ్ లో ఉండగా అమ్మాయి తల్లి అవుతుంది. ఆ తర్వాత వారి లైఫ్ ఎలా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల ఎదుర్కొన్నారు అనేదే మిగతా స్టోరీ. సినిమాలో ఎమోషన్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. 

3. ఇరాట్ట(తెలుగు) 
 
ఈ మధ్య కాలంలో ఓటీటీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘ఇరాట్ట’. రోహిత్ ఎం.జి కృష్ణన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో జోజు జార్జి నటనకు మంచి మార్కులు పడ్డాయి. మలయాళంలో విడుదల అయిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకోవడంతో ఇతర భాషల్లోకి కూడా డబ్ చేశారు. ఈ మూవీ నెట్  ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. 

4. బొమ్మై నయగి (తమిళ్)

దర్శకుడు షాన్ దర్శకత్వంలో యోగి బాబు ప్రధాన పాత్రలో వచ్చిన సినిమానే ఈ బొమ్మై నయగి. ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. లైంగిక వేధింపులకు గురైన ఓ తొమ్మిదేళ్ల పాప తండ్రి న్యాయం కోసం పోరాడే కథే ఇది. అలాగే సామాజిక అసమానతలను కూడా చాలా చక్కగా చూపించారు మేకర్స్. ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. 

5. గుల్మొహర్ (హిందీ)

ఈ మూవీకు రాహుల్ వి చిట్టెల్లా దర్శకత్వం వహించారు. మనోజ్  భాజ్ పాయ్, షర్మీలా ఠాకూర్, సిమ్రన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇది ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో మంచి టాక్ తో నడుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

6. తంకమ్ (మలయాళం)

వినీత్ శ్రీనివాసన్, బిజు మీనన్, గిరిష్ కులకర్నీ, అపర్ణ బాలమురళీ ప్రధాన పాత్రలలో నటించిన మూవీనే ఈ ‘తంకమ్’. ఈ మూవీకు సహీద్ అర్ఫాథ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

7. అన్ లాక్డ్ (కొరియా)

ఈ మూవీ కిమ్ టీ జూన్ దర్శకత్వంలో తెరకెక్కింది. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ఓ అమ్మాయి ఒక డేంజర్ వ్యక్తికి చిక్కడంతో తర్వాత ఆమె లైఫ్ ఎలా మలుపు తిరిగింది అనేదే కథ. ఈ మూవీ సైబర్ క్రైమ్ పట్ల ఎడ్యూకేట్ చేస్తూనే మంచి థ్రిల్లర్ ఫీలింగ్ ను ఇస్తుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. 

8. రన్ బేబీ రన్ (తెలుగు)

జయిన్ కృష్ణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఇతర భాషల్లో కూడా డబ్ చేసి ఓటీటీ లో విడుదల చేశారు. ఓ బ్యాంక్ లో పనిచేసే హీరో అనుకోకుండా ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు తర్వాత ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే కథ. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

Read Also: యూట్యూబ్ నుంచి ‘భీడ్‘ ట్రైలర్ తొలగింపు, ప్రజాస్వామ్య హత్య అంటూ నెటిజన్ల ఆగ్రహం

Published at : 17 Mar 2023 06:06 AM (IST) Tags: OTT Movies OTT Telugu Movies new movies OTT New Movies Best OTT Movies Best Thrillers in OTT

సంబంధిత కథనాలు

Movie Releases This Week: ఉగాది కానుకగా థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!

Movie Releases This Week: ఉగాది కానుకగా థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!

Priya Banerjee: ‘కిస్’ టు ‘అసుర’ - ‘రానా నాయుడు’ బ్యూటీ ప్రియా బెనర్జీ గురించి ఈ విషయాలు తెలుసా?

Priya Banerjee: ‘కిస్’ టు ‘అసుర’ - ‘రానా నాయుడు’ బ్యూటీ ప్రియా బెనర్జీ గురించి ఈ విషయాలు తెలుసా?

ఓటీటీలోకి నేరుగా రవిబాబు ‘అసలు’ సినిమా, మళ్లీ ఆమెతోనేనా?

ఓటీటీలోకి నేరుగా రవిబాబు ‘అసలు’ సినిమా, మళ్లీ ఆమెతోనేనా?

వెబ్ సీరిస్‌ల్లో అశ్లీల సీన్లు - విజయ్ శాంతి ఆగ్రహం ‘రానా నాయుడు’ పైనేనా?

వెబ్ సీరిస్‌ల్లో అశ్లీల సీన్లు - విజయ్ శాంతి ఆగ్రహం ‘రానా నాయుడు’ పైనేనా?

Aditi Rao Hydari : సిద్ధూతో ప్రేమ - అసలు అదితి చిక్కదు దొరకదు

Aditi Rao Hydari : సిద్ధూతో ప్రేమ - అసలు అదితి చిక్కదు దొరకదు

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్