Friday OTT Releases : ఒకే ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు - ఈ వారం 13 సినిమాల్లో ఆ 5 మాత్రం స్పెషల్
Friday OTT Releases : ఈ వారం ఓటీటీలోకి 13 సినిమాలు అడుగు పెడుతున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు ఒకే ఓటీటీలో ఉండగా, మరో మూడు తెలుగు సినిమాలు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.

Latest OTT Releases On Friday: పలు సౌత్ సినిమాలు రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. చాలా సినిమాలకు థియేటర్లలో కంటే ఓటీటీలోనే మంచి రెస్పాన్ దక్కుతోంది. సాధారణంగా థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాల తర్వాత కొన్ని సినిమాలు ఓటీటీలోకి అడుగు పెడుతుంటే, మరికొన్ని సినిమాలు ముందుగానే రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం ఓటీటీలోకి 13 సినిమాలు అడుగు పెట్టగా, అందులో 3 మాత్రమే తెలుగు సినిమాలు ఉన్నాయి.
ఈ ఫ్రైడే ఓటీటీలోకి 3 తెలుగు సినిమాలు
ఈ లిస్టులో 'వివేకానందన్ వైరల్' అనే తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ డ్రామా ఉంది. ఇది శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే 'రేఖాచిత్రమ్' అనే తెలుగు డబ్బింగ్ మలయాళం మిస్టరీలో ఈరోజే అంటే ఫిబ్రవరి 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
ఒకే ఓటీటీలో రెండు తెలుగు సినిమాలు
ఒక్క డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో మాత్రం రెండు తెలుగు సినిమాలు ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ లిస్టులో 'దేవకీ నందన వాసుదేవ', 'కోబలి' ఉన్నాయి. ఇందులో 'కోబలి' అనే రివేంజ్ డ్రామా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చింది. రెండ్రోజుల నుంచి హాట్ స్టార్‌లో ఈ మూవీ దుమ్మురేపుతోంది. రవి ప్రకాష్, శ్రీ తేజ, శ్యామల తదితరులు కీలకపాత్రలు పోషించిన తెలుగు క్రైమ్ డ్రామా 'కోబలి'. భారీ హైప్‌తో ఈ మూవీ ఈ వారమే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది.
దేవకి నందన వాసుదేవ
అశోక్ గల్లా, మానస వారణాసి హీరో హీరోయిన్లుగా నటించిన యాక్షన్ డ్రామా 'దేవకీ నందన వాసుదేవ'. ఫిబ్రవరి 8 నుంచి ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఒకే టైమ్‌లో ఇటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో, అటు కలర్స్ టీవీ ఛానల్‌లో ప్రీమియర్ కానుంది. నవంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథను అందించగా అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. లాలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్లో సోమినేని బాలకృష్ణ ఈ మూవీని నిర్మించారు. బీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి సంగీతం అందించారు. తన సోదరి కూతురు వల్ల ఫ్యామిలీకి ముప్పు ఉందనే జాతకాన్ని నమ్మి, సోదరుడు ఆమె కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటాడు. అతని నుంచి ఫ్యామిలీని హీరో కాపాడతాడు. అయితే ఈ మూవీ థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఫిబ్రవరి 8న హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, ఈ వారం తెలుగు ఆడియన్స్‌కు సినిమాల పండగే. 'గేమ్ ఛేంజర్' నుంచి మొదలు పెడితే, 'దేవకీ నందన వాసుదేవ'తో పాటు మరో రెండు డబ్బింగ్ సినిమాలు తెలుగులో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయి.
Read Also: Vishwak Sen: 'అంతా ఒకటే, దయచేసి కాంపౌండ్‌లు పెట్టొద్దు' - మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్ట్రాంగ్ రిప్లై





















