అన్వేషించండి

Oke Oka Jeevitham: ప్రభాస్, రామ్ చరణ్ కోసం శర్వానంద్ స్పెషల్ స్క్రీనింగ్!

'ఒకే ఒక జీవితం' సినిమాను తన స్నేహితులైన ప్రభాస్, రామ్ చరణ్, రానాల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారట శర్వానంద్. 

టాలీవుడ్ లో ఉన్న మిడ్ రేంజ్ హీరోల్లో శర్వానంద్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించే సినిమాలన్నీ మినిమం గ్యారెంటీ హిట్స్ గా ఉండేవి. అయితే ఈ మధ్యకాలంలో శర్వానంద్ కి సరైన హిట్టు పడలేదు. దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగ్నేశ రూపొందించిన 'శతమానం భవతి' సినిమాతో భారీ విజయం అందుకున్న శర్వా.. ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నారు. 'పడి పడి లేచే మనసు', 'శ్రీకారం', 'జాను', 'రణరంగం', 'మహాసముద్రం', 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఇలా వరుసగా ప్లాప్ సినిమాల్లో నటించారు.
 
ప్రస్తుతం ఆయన నటించిన సినిమా 'ఒకే ఒక జీవితం' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్(Dream Warrior Pictures) బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్‌ డైలాగ్స్ రాశారు. ఈ సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో అమల అక్కినేని కనిపించనున్నారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
 
ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది. కానీ ఈ సినిమాకి సరైన బజ్ రావడం లేదు. దీంతో ఇప్పుడు ప్రమోషన్స్ గట్టిగా చేయాలని భావిస్తున్నారు శర్వానంద్. ఈ సినిమాను తన స్నేహితులైన ప్రభాస్, రామ్ చరణ్, రానాల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారట. వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకొని.. ఈ సినిమా ప్రమోషన్స్ లో తన స్నేహితులను వాడుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే శర్వానంద్ తన బాల్య స్నేహితులు కొంతమందికి సినిమాను చూపించారు. 
 
వాళ్లందరి నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందట. ఇప్పుడు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కోసం స్పెషల్ షో వేయబోతున్నారు. సెప్టెంబర్ 6, 7,8 తేదీల్లో 'ఒకే ఒక జీవితం' స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు మిగిలిన మెయిన్ సిటీస్ లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారని సమాచారం. అయితే ఈ వారంలోనే 'బ్రహ్మాస్త' సినిమా రిలీజ్ కానుంది. ఇది భారీ బడ్జెట్ సినిమా. తెలుగులో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాతో శర్వానంద్ పోటీ పడడం విశేషం. 
 
'ఒకే ఒక జీవితం' సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతోంది. దీనిపైనే శర్వానంద్ ఆశలన్నీ పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతోనైనా ఆయన ప్లాప్ స్ట్రీక్ కి ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి. లేదంటే మాత్రం ఆయన కెరీర్ ఇబ్బందుల్లో పడడం ఖాయం. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ సినిమాకి పని చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు.
 
 
 

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - బ్లాక్ బస్టర్ ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్
Horror Thriller OTT : నాలుగు ఓటీటీల్లో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
నాలుగు ఓటీటీల్లో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Sobhita Dhulipala : మనకు మనమే శత్రువులం - ఎవరూ సపోర్ట్ చేయరు... అక్కినేని కోడలు శోభిత ధూళిపాల రియాక్షన్
మనకు మనమే శత్రువులం - ఎవరూ సపోర్ట్ చేయరు... అక్కినేని కోడలు శోభిత ధూళిపాల రియాక్షన్
Raaka Update : అల్లు అర్జున్ రాకా నుంచి సీక్రెట్ పోస్టర్ - 37 డీకోడ్ చేస్తే...
అల్లు అర్జున్ రాకా నుంచి సీక్రెట్ పోస్టర్ - 37 డీకోడ్ చేస్తే...

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR 2004 election affidavit: కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
KTR counter to Revanth Reddy: కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
West Bengal: అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Russia Sanctions Bill: భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
Ganesha Visarjan Date time 2026: గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 24 or 25? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
గణేష్ నిమజ్జనం 2026: సెప్టెంబర్ 24, 25లో ఏది సరైన తేదీ? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget