అన్వేషించండి

Nagababu-Niharika: నాగబాబు కూతురా మజాకా, నొప్పిని తీసేస్తానని కొత్తనొప్పి తెచ్చిపెట్టిందిగా!

నాగబాబు, నిహారిక చేసిన ఓ ఫన్నీ వీడియో నెటిజన్లు ఎంతో ఆకట్టుకుంటుంది. గాయంతో బాధపడుతున్న నాగబాబుకు చిటికెలో నొప్పి తగ్గిస్తానంటూ నిహారిక చేసిన పనికి నెటిజన్లు నవ్వుల్లో మునిగితేలుతున్నారు.

మెగా బ్రదర్ నాగబాబు.. మెగాస్టార్ సోదరుడిగానే కాకుండా.. నిర్మాతగా, నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై కామెడీ షోల్లో జడ్జిగా దర్శనం ఇస్తున్నారు. సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటారు. సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసి.. రాజకీయాలతో పాటు అన్ని విషయాల మీద మాట్లాడుతూ ఉంటారు. మెగా ఫ్యామిలీ మీద ఎవరు ఏ చిన్న మాట అన్నా అస్సలు ఊరుకోరు. కామెంట్స్ కు కౌంటర్.. కౌంటర్ కు రివర్స్ కౌంటర్లు వేస్తుంటారు. తన కుమార్తె నిహారికతో కలిసి ఫన్నీ ఫన్నీ వీడియోలు షేర్ చేస్తుంటారు. తాజాగా ఇన్ స్టా వేదికగా కూతురుతో కలిసి ఉన్న ఓ ఫన్నీ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

కొద్ది రోజుల క్రితం నాగబాబు చేతికి గాయం అయ్యింది. హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత డాక్టర్లు నాగబాబు చేతికి ఓ బ్యాండేజ్ వేశారు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో తన కూతురితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫన్నీ పనులు చేశారు. ఇదే వీడియోను నాగబాబు సోషల్ మీడియాలో పెట్టి ‘ముల్లును ముల్లుతోనే తీయాలి అంటే ఇదేనేమో’ అనే క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.  

ఇంతకీ నాగబాబు షేర్ చేసిన వీడియోలో ఏం ఉందంటే.. చేతికి బ్యాండేజ్ వేసుకుని సోఫాలో కూర్చున్నారు. ఆయన పక్కనే నిహారిక కూర్చుంది. గాయం అయిన చేతికి బాగా నొప్పిగా ఉందంటారు నాగబాబు. ఆ నొప్పిని నేను పోగొట్టనా? అంటుంది నిహారిక. ఏదైనా మంత్రం వేస్తావా? అంటారు నాగబాబు. ఏం మంత్రం వేయకుండానే నొప్పి తగ్గిస్తానని తను చెప్తుంది. సరే అని నాగబాబు చెప్పడంతో.. ఆయన ఎడమ చేతిని తీసుకుని గట్టిగా కొరుకుతుంది. వెంటనే నాగబాబు అబ్బా అని అరుస్తారు. చూశావా.. ఆ చేయి నొప్పి పోయింది అంటుంది నీహారిక. ఇప్పుడు ఈ చేయి నొప్పిగా ఉంది కదమ్మా అంటారు నాగబాబు. తండ్రి  మాటవిని నిహారిక నవ్వుతుంది.  ఈ వీడియోను నాగబాబు తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ‘‘ముల్లును ముల్లుతోనే తీయాలి అంటే ఇదేనేమో.. దయచేసి దీనిని ఇంటి దగ్గర ట్రై చేయకండి. ఇది నిపుణురాలైన డాక్టర్ నిహారిక పర్యవేక్షణలో జరిగింది’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Naga Babu Konidela (@nagababuofficial)

సోషల్ మీడియాలో నెటిజన్లు బోలెడు కామెంట్లు పెడుతున్నారు. తండ్రీ కూతుళ్ల మధ్య ఎంత మంది అనుబంధం ఉందో.. అని కామెంట్ చేస్తున్నారు.  ఇంతకీ చేతికి ఏమైంది సర్.. అంటూ కొందరు అడుగుతుండగా.. త్వరగా కోలుకోవాలని మరికొందరు కోరుకుంటున్నారు.

Also Read: నడవలేని స్థితిలో మైక్ టైసన్‌, ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Also Read: ‘బ్లాక్ కాఫీ’ ప్రేమలో షారుఖ్, రితేష్‌ - దీని ప్రయోజనాలు తెలిస్తే మీరూ లవ్‌లో పడిపోతారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Viral News: ఇద్దరు భర్తలు -  రెండు మంగళసూత్రాలు - ఒకే మంచం, ఒకే కంచం - ఈ మహిళ సతీలీలావతి కంటే ఎక్కువే
ఇద్దరు భర్తలు - రెండు మంగళసూత్రాలు - ఒకే మంచం, ఒకే కంచం - ఈ మహిళ సతీలీలావతి కంటే ఎక్కువే
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Embed widget