New Year 2023: సిద్ధార్థ్-కియారా టు అలియా-రణబీర్, సెలబ్రిటీ కపుల్స్ జోష్ ఫుల్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్
ప్రముఖ బాలీవుడ్ కపుల్స్ న్యూ ఇయర్ వేడుకల్లో సందడి చేశారు. క్యాండిల్ వెలుగుల్లో కేక్ కట్ చేసి ఎంజాయ్ చేశారు. సిద్ధార్థ్-కియారా నుంచి మొదలుకొని అలియా-రణబీర్ వరకు న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారో చూద్దాం..
2022కి గుడ్ బై చెప్పి 2023లోకి ప్రపంచం ఎంటరైంది. ప్రజలంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా నూతన సంవత్స వేడుకలను జరుపుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం జోష్ ఫుల్ గా న్యూ ఇయర్ జరుపుకున్నారు. బాలీవుడ్ కపుల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తెలుసుకుందాం..
1.సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ
ఈ బాలీవుడ్ లవ్ బర్డ్స్ దుబాయ్ వేదికగా కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, కరణ్ జోహార్, రాణి ముఖర్జీతో కలిసి న్యూ ఇయర్ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలను మనీష్ ఇన్ స్టాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో సిద్ధార్థ్, కియారా గ్లామ్ దుస్తుల్లో కనిపించారు. కియారా గ్రీన్ ర్యాప్-అరౌండ్ డ్రెస్‌లో అబ్బురపర్చగా, సిద్ పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. మనీష్, కరణ్ కూడా పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లోనే దర్శనం ఇచ్చారు. వీరిద్దరు ‘షేర్షా’ సెట్స్ లో ప్రేమలో పడ్డారు. ఫిబ్రవరి 6న జైసల్మేర్ ప్యాలెస్ హోటల్‌లో వివాహం చేసుకోనున్నారు.
View this post on Instagram
2.అలియా భట్-రణ్ బీర్ కపూర్
తాజాగా పేరెంట్స్ అయిన ఈ జంట కొత్త జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. ఏప్రిల్ 2022లో వివాహం చేసుకున్న ఈ జంట నవంబర్ 2022లో తమ మొదటి కుమార్తె రాహాకు జన్మనిచ్చారు. ఇద్దరూ తమ కుమార్తెతో ఎంజాయ్ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలను ఈసారి ఇంట్లోనే జరుపుకున్నారు. అలియా షిమ్మరీ హెయిర్ బ్యాండ్‌తో అందమైన పైజామాలో కనిపించింది. రణ్ బీర్ పూర్తిగా బ్లాక్ నైట్ సూట్ లో కనిపించాడు. ఈ పార్టీలోలవ్ రంజన్, రోహిత్ ధావన్, షాహీన్ భట్, ఆదిత్య రాయ్ కపూర్ పాల్గొన్నారు.
View this post on Instagram
3.కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్
న్యూ ఇయర్ సందర్భంగా కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ జిస్టాడ్‌ను సందర్శించారు. మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంది. తైమూర్ స్కీయింగ్‌ను ఆస్వాదిస్తున్న వీడియోను కరీనా షేర్ చేసింది. 2022కి వీడ్కోలు చెప్పే ముందు, బెబో చివరి సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ కనిపించింది.
View this post on Instagram
4.వరుణ్ ధావన్-నటాషా దలాల్
వరుణ్ ధావన్, నటాషా దలాల్ కొత్త సంవత్సరం వేళ జంగిల్ సఫారీకి వెళ్లారు. ఆ తర్వాత ఇండస్ట్రీ ఫ్రెండ్స్ తో హ్యాపీగా జాలీగా గడిపారు. విద్యుత్ కాంతుల్లో వారంతా కలిసి తీసుకున్న ఫోటోలను వరుణ్ ఇన్ స్టాలో పోస్టు చేశారు.
View this post on Instagram
5.అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ
అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ తన కూతురుతో కలిసి దుబాయ్ లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ జంట విలాసవంతమైన హోటల్‌లో కుటుంబంతో కలిసి హాయిగా డిన్నర్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అనుష్క విరాట్‌తో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. విరాట్ తెల్లటి టీ-షర్ట్ ధరించి ఉండగా, అనుష్క నలుపు రంగు దుస్తులలో చాలా అందంగా కనిపించింది.
View this post on Instagram
Read Also: తునీషా శర్మ సూసైడ్ టు రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్, 2022లో టాప్ 10 కాంట్రవర్సీలు ఇవే!