![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Navdeep Love Mouli: నవదీప్‌లో మార్పు - ఒంటి మీద నూలు పోగు లేకుండా!
కథానాయకుడు, నటుడు నవదీప్ తన విలువ తెలుసుకున్నారు. తనను తాను కొత్తగా మలుచుకుని 'లవ్ మౌళి' సినిమా చేశారు. హీరో క్యారెక్టర్ టీజర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
![Navdeep Love Mouli: నవదీప్‌లో మార్పు - ఒంటి మీద నూలు పోగు లేకుండా! Navdeep realized his worth reveals interesting facts in Love Mouli movie teaser launch Telugu news Navdeep Love Mouli: నవదీప్‌లో మార్పు - ఒంటి మీద నూలు పోగు లేకుండా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/28/04cce891d3ab824bdbfee2302439fd4f1701163732103313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nav Deep 2.0 looks promising in Love Mouli hero teaser: తెలుగు ప్రేక్షకులు మెచ్చిన టాలెంటెడ్ యంగ్ హీరోల్లో నవదీప్ ఒకరు. ఆయన కెరీర్ హీరోగా హిట్ సినిమాలతో మొదలైంది. తర్వాత అగ్ర కథానాయకుల చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తూ... మరోవైపు హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే... ఆశించిన విజయాలు రాలేదు. దాంతో కొంత విరామం తీసుకుని కొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
'లవ్ మౌళి' సినిమాలో నవ్ దీప్ 2.0!
Love Mouli Telugu Movie: నవదీప్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'లవ్ మౌళి'. అవనీంద్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు నిర్మించాయి. సి స్పేస్ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించింది. ఈ సినిమాలో నవదీప్ లుక్, 'ఏంతమ్ ఆఫ్ లవ్ మౌళి' పాటకు మంచి స్పందన వచ్చింది. ఇందులో నవదీప్ కొత్తగా ఉన్నారని, 'నవ్ దీప్ 2.O' అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. లేటెస్టుగా 'లవ్ మౌళి హీరో' టీజర్ విడుదల చేశారు.
ఒంటి మీద నూలు పోగు లేకుండా...
'లవ్ మౌళి' హీరో టీజర్ కొందరికి షాక్ ఇస్తే... రెగ్యులర్ కంటెంట్ కాకుండా కొత్త రకం సినిమాలు కోరుకునే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టీజర్ ప్రారంభమే ఒంటి మీద నూలు పోగు లేకుండా నవదీప్ కనిపించారు. మందు బాటిల్ పగలగొట్టి వైవిధ్యంగా కనిపించారు. సినిమాలో హీరో హిప్పీ తరహా రోల్ చేశారని అర్థం అవుతోంది.
Also Read: రష్మిక రాలేదు... కానీ 'గర్ల్ ఫ్రెండ్' మొదలు!
టీజర్ ఆవిష్కరణ కార్యకమంలో నవదీప్ మాట్లాడుతూ ''జీవితంలో మనం ఎన్నో చేయాలని అనుకుంటాం. కానీ, జరిగేది వేరు. జీవిత పరుగులో నిగగ్నమైన మనం ఆ విషయాన్ని గమనించం. ఎక్కడో ఒక దగ్గర ఆగి ఆలోచిస్తే... మనకు ఆ విషయం తెలుస్తుంది. నేనూ వేర్వేరు సినిమాలు, అనవసరమైన సినిమాలు చేశా. కరోనా వల్ల వచ్చిన విరామం (లాక్‌డౌన్)లో నా విలువ ఏమిటో తెలుసుకున్నా. అప్పుడు విన్న కథ ఇది. నా ఆలోచన విధానానికి, నేను చేయాలనుకుంటున్న సినిమాలకు 'లవ్, మౌళి' దగ్గరగా అనిపించింది. ప్రేక్షకుల ముందుకు సరికొత్త చిత్రంతో రాబోతున్నా'' అని అన్నారు.
Also Read: యానిమల్ వయలెన్స్... సలార్ యాక్షన్... డిసెంబర్‌లో ధూమ్ ధామ్ థియేటర్లలోకి భారీ అండ్ క్రేజీ సినిమాలు
దర్శకుడు అవనీంద్ర మాట్లాడుతూ ''నా జీవితంలో జరిగిన ప్రేమకథలకు ఫలితమే 'లవ్ మౌళి' కథ. ప్రేమలో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. నా స్వీయ అనుభవాలను ఈ కథగా మలిచా'' అని అన్నారు. కథానాయిక పంఖురి గిద్వానీ, నటి భావన, కళా దర్శకుడు కిరణ్ మామిడి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
నవదీప్ హీరోగా... పంఖురి గిద్వానీ కథానాయికగా, భావన సాగి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో 'మిర్చి' హేమంత్, 'మిర్చి' కిరణ్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు: నైరా క్రియోషన్స్ - శ్రీకర స్టూడియోస్, నిర్మాణం: సి స్పేస్, సాహిత్యం: అనంత శ్రీరామ్, కళా దర్శకత్వం: కిరణ్ మామిడి, సంగీతం: గోవింద్ వసంత, రచన - ఛాయాగ్రహణం - కూర్పు - దర్శకత్వం: అవనీంద్ర.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)