అన్వేషించండి

Hi Nanna Trailer: లవ్, ఎమోషన్, సెంటిమెంట్‌తో నిండిపోయిన ‘హాయ్ నాన్న’ - ట్రైలర్ వచ్చేసింది చూశారా?

Hi Nanna: నాని, మృణాల్ ఠాకూర్‌ల ‘హాయ్ నాన్న’ ట్రైలర్ విడుదల అయింది.

Natural Star Nani Hi Nanna Trailer: నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా ‘హాయ్ నాన్న’. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమాను తెరకెక్కించారు. డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ‘హాయ్ నాన్న’ ట్రైలర్‌ను మేకర్స్ శుక్రవారం (నవంబర్ 24వ తేదీ) విడుదల చేశారు. ట్రైలర్ నిడివి రెండు నిమిషాల 41 సెకన్లుగా ఉంది.

ఈ సినిమా ట్రైలర్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు రెండున్నర గంటల సినిమా నుంచి రెండున్నర నిమిషాలు ప్రేక్షకులకు చూపించబోతున్నామని హీరో నాని ట్వీట్ చేశారు. దీన్ని బట్టి సినిమా రన్ టైమ్ రెండున్నర గంటలు అని అర్థం చేసుకోవచ్చు. కూతురిపై ప్రేమ, కుటుంబం నేపథ్యంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ‘హాయ్ నాన్న’. ఇటీవల ఎక్కువ రన్ టైమ్ ఉన్న సినిమాలకు నిడివి ఎక్కువైందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ‘అంటే సుందరానికి’ విషయంలో నాని కూడా ఈ సమస్యలు ఎదుర్చున్నాడు. కాబట్టి ఈ విషయంలో నాని ముందు జాగ్రత్త తీసుకున్నారని ఊహించవచ్చు.

ఈ సినిమా ప్రమోషన్‌ విషయంలో కూడా నాని కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఎన్నికల ఫీవర్ నేపథ్యంలో నాని రాజకీయ నాయకుడిగా చేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్‌లను నాని అనుకరిస్తూ చేసిన వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

అంతే కాకుండా 'హాయ్ నాన్న' డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ డీల్స్ విషయాల్లో కూడా హీరో నాని ఇన్వాల్వ్ అయ్యారని టాలీవుడ్ వర్గాల టాక్. ఈ ఇన్వాల్వ్‌మెంట్ వెనుక ఆయన రెమ్యునరేషన్ ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ సినిమాకు నానికి 25 కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చేందుకు నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. డిసెంబర్ తొలి వారంలో ‘హాయ్ నాన్న’తో పాటు మరో మూడు నాలుగు సినిమాలు కూడా వస్తున్నాయి. థియేటర్ల విషయంలో భారీ పోటీ నెలకొనడంతో ఎక్కువ రేట్లు పెట్టి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవడానికి బయ్యర్లు ఎవరు ముందుకు రావడం లేదని. దీంతో హీరో నాని స్వయంగా రంగంలోకి దిగుతున్నారని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాలో నాని కూతురి పాత్ర కూడా చాలా కీలకం. బేబీ కియారా ఆ పాత్రలో కనిపించారు. ‘ఖుషి’ అంటూ సూపర్ హిట్ ఆల్బం అందించిన హేషామ్ అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించారు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫర్‌గా ఉన్నారు. నానితో ఆయనకు ఇది మూడో చిత్రం. 'జెర్సీ', 'శ్యామ్‌ సింగ రాయ్' చిత్రాలకు కూడా ఆయనే పని చేశారు. ఆ రెండు చిత్రాల్లో సినిమాటోగ్రఫీ బావుందని మంచి పేరు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటల్లో కూడా సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం బావుంది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget