By: ABP Desam | Updated at : 18 Mar 2022 08:06 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వాషింగ్టన్ సుందర్‌కు నేచురల్ స్టార్ నాని ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఐపీఎల్ మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కానుంది. అన్ని జట్లలోని ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో బిజీ అయితే... సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రమోషన్స్‌లో బిజీ అయ్యాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఫ్యాన్స్‌తో ఎప్పుడూ ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది.
భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను రూ.8.75 కోట్లతో సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తను సన్‌రైజర్స్ జట్టుతో ప్రాక్టీస్ ప్రారంభించాడు. దీన్ని జట్టు సోషల్ మీడియా హ్యాండిల్ క్రియేటివ్‌గా తెలియజేసింది. నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా జూన్ 10వ తేదీన విడుదల కానున్నట్లు నిర్మాతలు గతంలోనే ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీకి, వాషింగ్టన్ సుందర్‌ను లింక్ చేస్తూ సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది.
‘అంటే ఆ సుందరం జూన్‌లో వస్తాడు, ఈ సుందర్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాడు.’ అని సన్‌రైజర్స్ ట్వీట్ చేయగా... దానికి నేచురల్ స్టార్ నాని స్పందించాడు. ‘ఆల్ ది బెస్ట్ సుందర్, ఫ్రం సుందర్.’ అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ కూడా ఈ ట్వీట్‌కు స్పందిస్తూ ‘వచ్చాను గయ్స్’ అని రిప్లై ఇచ్చాడు.
నాని ఐపీఎల్ జట్లతో ఇంటరాక్ట్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా తెలుగు కుర్రాడు హరి శంకర్ రెడ్డి... చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నప్పుడు తను జెర్సీలో నాని నటన నచ్చింది అని చెప్పిన వీడియో ఒకటి చెన్నై తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దానికి నాని ‘చూసేశా’ అని రిప్లై ఇచ్చాడు.
ఇక ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన మొదటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. మార్చి 29వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. మార్చి 26వ తేదీన జరగనున్న మొదటి మ్యాచ్‌లో చెన్నై, కోల్‌కతా తలపడనున్నాయి.
All the best sundar 👍🏼
— Nani (@NameisNani) March 18, 2022
From
Sundar :) https://t.co/ht6yD6qRup
Ante aa Sundaram June lo vastadu, ee Sundar training kuda start chesadu. 💪#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/dxHrqIRswB
— SunRisers Hyderabad (@SunRisers) March 18, 2022
Choosesa 💛 https://t.co/J8ivLY2eKw
— Nani (@NameisNani) April 5, 2021
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?
Pakka Commercial 2nd Single: రాశి, అందాల రాశి - హీరోయిన్ పేరు మీద 'పక్కా కమర్షియల్' సినిమాలో సాంగ్, రిలీజ్ ఎప్పుడు అంటే?
Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!
Stock Market News: సెన్సెక్స్ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!