అన్వేషించండి

Nani: నాని అండ్ గ్యాంగ్, దేన్నీ వదలడం లేదుగా 

నాని అండ్ గ్యాంగ్ గోదావరి ఖని ప్రాంతంలో అన్ని ఫంక్షన్ హాల్స్ ను ఆక్యుపై చేసేశారు. 

నేచురల్ స్టార్ నాని 'దసరా' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలో జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా నాని, కీర్తి సురేష్ పై భారీ స్థాయిలో పాటని షూట్ చేస్తున్నారు. 

ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు కోరియోగ్రఫీ అందిస్తున్నారు. దాదాపు 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇంతమంది డాన్సర్స్ కోసం చిత్రబృందం గోదావరిఖని ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లను, కొన్ని ప్రైవేట్ హాల్స్ ను, కళ్యాణమండపాలను బుక్ చేసింది. ఇది ఖర్చుతో కూడుకున్న పని మాత్రమే కాదు.. ఇంతమందిని మేనేజ్ చేయడమంటే చాలా శ్రమతో పడాల్సి వస్తుంది. అంత చిన్న సిటీలో ఇంత మందితో షూటింగ్ చేస్తోంది 'దసరా' టీమ్. ఆ ఊర్లో వారంతా ఒక్క ఫంక్షన్ హాల్ కూడా ఖాళీగా లేకపోవడంతో షాక్ అవుతున్నారు. 

ఈ సినిమాతో మాస్ హీరో ఇమేజ్ సంపాదించాలని చూస్తున్నాడు నాని. మరి ఆయన అనుకున్నట్లుగా మాస్ హిట్ అందుకుంటారేమో చూడాలి. ఇక ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.  ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌, నవీన్ నూలి ఎడిటర్‌.

Also Read: 'బీస్ట్' సినిమా టికెట్స్ కొంటే పెట్రోల్ ఫ్రీ - ఎక్కడో తెలుసా?

Also Read: రాజమౌళి, నాగ చైతన్య వాడే ఈ కారు ప్రత్యేకతలు తెలుసా? ఆస్తులు అమ్మినా దీన్ని కొనలేం!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nani (@nameisnani)

టాప్ హెడ్ లైన్స్

Ganguly Doosra Row: గంగూలీ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దూస్రా చిత్ర ప్రదర్శనపై కీలక తీర్పు
గంగూలీ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దూస్రా చిత్ర ప్రదర్శనపై కీలక తీర్పు
Family Drama OTT : మూడు ఫ్యామిలీస్... ఊహించని షాక్ - నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ
మూడు ఫ్యామిలీస్... ఊహించని షాక్ - నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ
Ramayana Review : సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతం - 'రామాయణ'పై వారణాసి రాముడి రివ్యూ
సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతం - 'రామాయణ'పై వారణాసి రాముడి రివ్యూ
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వన్ లాస్ట్ ఛాన్స్! వర్షిణిపై ముకేశ్ సీరియస్‌! గెలిచిందెవరు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వన్ లాస్ట్ ఛాన్స్! వర్షిణిపై ముకేశ్ సీరియస్‌! గెలిచిందెవరు?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Metro Combined Pass: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Vantara: మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Embed widget