Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!
‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ ‘సుమ అడ్డా’ కార్యక్రమానికి హాజరయింది.
టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ‘బింబిసార’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ మూవీ తో ఆయన మళ్లీ ట్రాక్ లో పడ్డారనే చెప్పాలి. ‘బింబిసార’ లాంటి సక్సెస్ తర్వాత ఆయన నటిస్తోన్న మూవీ ‘అమిగోస్’. ఈ మూవీ ఫిబ్రవరి 10 న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా ట్రిపుల్ రోల్ లో అలరించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది మూవీ టీమ్. ఈ నేపథ్యంలో యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తోన్న ‘సుమ అడ్డా’ కార్యక్రమానికి హాజరైంది చిత్ర బృందం. నందమూరి కళ్యాణ్ రామ్ తో పాటు హీరోయిన్ ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ కూడా ఈ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. ఇటీవల ఈ ప్రోగ్రాం కు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల అయింది.
‘సుమ అడ్డా’ కార్యక్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ షో ప్రోమో చూస్తుంటే ఓ రేంజ్ లో హంగామా చేసినట్టే కనిపిస్తోంది. యాంకర్ సుమ కళ్యాణ్ రామ్ ను ‘అమిగోస్’ అంటే ఏమిటీ అని అడిగింది. దానికి ఆయన బదులిస్తూ.. ‘అమిగోస్’ అంటే స్పానిష్ లో ఫ్రెండ్స్ అని అర్థం అని చెప్పారు. అయితే ఫ్రెండ్స్ అనే పెట్టొచ్చుగా అంటూ తన స్టైల్ లో పంచ్ లు వేసింది సుమ. తర్వాత బ్రహ్మీజీ గేమ్ ఆడుతుండగా షోలో ఓ అమ్మాయి వచ్చి.. నన్ను పది మంది అబ్బాయిలు ఫాలో అవుతున్నారు అని అంటుంటే.. మధ్యలో సుమ ఎంటర్ అయి చెప్పక చెప్పక ఆయనకే చెప్పావా ఇక రేపటి నుంచి ఆ నెంబర్ 11 అవుతుందిలే అని డైలాగ్ వేస్తుంది. దీంతో సెట్ లో నవ్వులు పూచాయి.
తర్వాత యాంకర్ సుమ హీరో కళ్యాణ్ రామ్ కు ఓ టాస్క్ ఇస్తుంది. ఈ టాస్క్ లో ఆయన ఆషికా కు ప్రపోజ్ చేయాలి. అయితే కళ్యాణ్ రామ్ ఆమె చాలా అందంగా ప్రపోజ్ చేస్తూ ఉండగా ఆమె పువ్వు తీసుకోవడం లేట్ అవ్వడంతో ఆమె కంటే మీరు ఇంకా బాగున్నారు అంటూ ఆ గులాబీను సుమకు ఇచ్చే సన్నివేశం చాలా సరదాగా అనిపిస్తుంది. మొత్తంగా సుమ అడ్డా కార్యక్రమంలో ఈసారి ప్రోమో కూడా చాలా ఫన్నీగా అలాగే ఆసక్తిని రేపే విధంగా ఉంది. ఇక ‘అమిగోస్’ విషయానికొస్తే ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ‘ఎన్నో రాత్రులొస్తాయిగాని..’ పాటకు మంచి స్పందన వస్తోంది. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ మొదటి సారి ట్రిపుల్ రోల్ లో కనిపించనుండటంతో ఆయన ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.