#NBK107 Balayya Look: బాలయ్య కొత్త సినిమా లుక్ లీక్ - ఆ కన్నడ సినిమాకి రీమేకా?

బాలకృష్ణ కొత్త సినిమా #NBK107 లుక్ ఆన్‌లైన్‌లో లీకైంది.

FOLLOW US: 

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు (ఫిబ్రవరి 18వ తేదీ) ప్రారంభం అయింది. సిరిసిల్ల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ ఇంటర్నెట్‌లో లీకైంది.

బాలయ్య తన వయసుకు తగ్గ పాత్రలో కనిపిస్తుండటం, అదే సమయంలో లుక్ మంచి మాస్‌గా ఉండటంతో నందమూరి అభిమానులు ఈ లుక్ చూసి పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ లుక్ చూశాక సినిమా స్టోరీపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కన్నడ సినిమా ‘మఫ్టీ’లో శివరాజ్ కుమార్, ఆ సినిమాకు తమిళ రీమేక్ ‘పత్తు తల’లో శింబు లుక్ తరహాలో బాలయ్య లుక్ ఉంది. దీంతో ఈ సినిమా రీమేక్ అని కొంతమంది అంటున్నారు.

అయితే దీనిపై చిత్రబృందం ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. బాలయ్య కోసం పవర్‌ఫుల్ కథని సిద్ధం చేసినట్లు గోపిచంద్ మలినేని చాలా సందర్భాల్లో చెప్పారు. మరి కొత్త కథ రాశారా, మఫ్టీనే తెలుగుకు తగ్గట్లు మార్చారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా మఫ్టీకి రీమేక్ అయితే ఇందులో మరో యువ హీరోకు కూడా స్కోప్ ఉంటుంది.ఈ పాత్రను కన్నడంలో ఉగ్రం ఫేమ్ శ్రీమురళి చేశారు. ప్రస్తుతం తమిళంలో కడలి ఫేమ్ గౌతమ్ కార్తీక్ చేస్తున్నారు.

గోపిచంద్ మలినేని గత చిత్రం క్రాక్‌లో తమిళ సినిమా సేతుపతిలోని సీన్లను కొన్ని ఉపయోగించినట్లు కనిపిస్తుంది. ఇంటర్వెల్ ఫైట్, శ్రుతి హాసన్ యాక్షన్ ఎపిసోడ్ (తమిళంలో హీరో కొడుకు సీన్) వంటి కొన్ని సన్నివేశాలు సేతుపతిని తలపిస్తాయి. గోపిచంద్ ఈసారి కేవలం లుక్ మాత్రమే ఆ సినిమాల నుంచి తీసుకున్నారా... లేకపోతే ఆ కథను రీమేక్ చేస్తున్నారా అనేది తెలియాలంటే మాత్రం సినిమా వచ్చేదాకా ఆగాల్సిందే!

Published at : 18 Feb 2022 10:14 PM (IST) Tags: Nandamuri Balakrishna Gopichand Malineni NBK107 NBK107 Look Leaked NBK107 Balayya Look

సంబంధిత కథనాలు

Urfi Javed: వీడియో - అయ్యో, పువ్వు అనుకుని ఫోన్ పడేసిందే, పిచ్చి ముదిరితే ఇంతే!

Urfi Javed: వీడియో - అయ్యో, పువ్వు అనుకుని ఫోన్ పడేసిందే, పిచ్చి ముదిరితే ఇంతే!

Madhavan Rocketry: మాధవన్ 'రాకెట్రీ' - తెలుగు సాంగ్స్ విన్నారా?

Madhavan Rocketry: మాధవన్ 'రాకెట్రీ' - తెలుగు సాంగ్స్ విన్నారా?

Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో బాలీవుడ్ స్టార్స్ - ఉపాసన పోస్ట్ వైరల్

Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో బాలీవుడ్ స్టార్స్ - ఉపాసన పోస్ట్ వైరల్

Pakka Commercial: నాన్ కమర్షియల్ రేట్లకు పక్కా కమర్షియల్ - మా సినిమా ఇప్పట్లో ఓటీటీలోకి రాదు

Pakka Commercial: నాన్ కమర్షియల్ రేట్లకు పక్కా కమర్షియల్ - మా సినిమా ఇప్పట్లో ఓటీటీలోకి రాదు

Dasara: 'దసరా' సినిమా - నాని రెమ్యునరేషన్ వదులుకుంటున్నారా?

Dasara: 'దసరా' సినిమా - నాని రెమ్యునరేషన్ వదులుకుంటున్నారా?

టాప్ స్టోరీస్

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

Janasena Janavani : " జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..

Janasena Janavani  :

Privatisation of PSU Banks: బ్యాంకుల ప్రైవేటీకరణ! పార్లమెంటులో కొత్త బిల్లు పెట్టనున్న కేంద్రం

Privatisation of PSU Banks: బ్యాంకుల ప్రైవేటీకరణ! పార్లమెంటులో కొత్త బిల్లు పెట్టనున్న కేంద్రం

Optical Illusion: ఈ బొమ్మలో ఒక జంతువు దాక్కొని ఉంది, 30 సెకన్లలో దాన్ని కనిపెడితే మీ కంటి చూపు భేష్

Optical Illusion: ఈ బొమ్మలో ఒక జంతువు దాక్కొని ఉంది, 30 సెకన్లలో దాన్ని కనిపెడితే మీ కంటి చూపు భేష్