Nagababu Sorry to Fans: ఆ పాత్రలపై నాగబాబు వివాదస్పద వ్యాఖ్యలు - క్షమాపణలు కోరిన మెగా బ్రదర్
Nagababu Post: మెగా బ్రదర్ నాగబాబు క్షమాపణలు కోరారు. ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తను చేసిన కామెంట్సని వెనక్కి తీసుకుంటున్నానని, అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని వివరణ ఇచ్చారు.
Nagababu Seeks Sorry: మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' రేపు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగా బ్రదర్ నాగబాబు పోలీసు పాత్రలపై నోరు జారిన సంగతి తెలిసిందే. దీంతో అతడి కామెంట్స్ వివాదానికి దారితీశాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగబాబు కామెంట్స్‌కు నొచ్చుకుని ఇది మా హీరోను ఉద్దేశించి అన్నారంటూ సోషల్ మీడియాలో చర్చ లేపారు. ఇది కాస్తా ముదిరి వివాదంగా మారింది. తన మాటలు కాంట్రవర్సి కావడంతో మెగా బ్రదర్ దిగొచ్చారు. ఆ కామెంట్స్ ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, అవి యాదృచ్ఛికంగా అన్న మాటలు అంటూ క్షమాపణలు కోరాడు.
కాగా ఇటీవల జరిగిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఈవెంట్‌లో నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై మాట్లాడిన ఆయన పోలిస్ పాత్రలు ఆరడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుందని, అయిదే అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)ను కామెంట్ చేశారని, ఆయన మీద సెటైర్లు వేశారంటూ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇది పెద్ద చర్చకు దారితీయడంతో తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరారు. ఈ మేరకు తన ఎక్స్‌లో పోస్ట్ షేర్ చేశారు.
నన్ను క్షమించండి..!
“ఇటీవల జరిగిన వరుణ్ బాబు ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను,ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను, ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే I’m Really Very sorry. అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని Wanted గా అన్న మాటలు కాదు. అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను” అంటూ వివరణ ఇచ్చారు. దీంతో నాగబాబు పోస్ట్ వైరల్‌గా మారింది. మరి ఆయన పోస్ట్‌తో అయినా ఫ్యాన్స్ కూల్ అవుతారా? చూడాలి.
ఇటీవల జరిగిన వరుణ్ బాబు 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను,ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను,ఎవరైన ఆ మాటలకి… pic.twitter.com/Ppr44YcqI8
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 29, 2024
ఐదు అడుగుల పోలీస్ అంటే కామెడీగా ఉంటుంది!
''కొన్నిసార్లు కొన్ని కొన్ని క్యారెక్టర్లు క్యారీ చేయాలంటే... 5.3 అడుగులు ఉన్న వాడు నేను స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అంటే కామెడీగా ఉంటుంది. నువ్వు కాదులేరా బాబు అనిపిస్తుంది'' - ఇదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగబాబు వీడియో క్లిప్. నిజానికి, ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే... ''ఒక ఆరు అడుగులు ఉన్న వాడు పెర్ఫార్మన్స్ చేస్తే ఏదో ఉందని చెబుతారు. వరుణ్ బాబుకు అంత మంచి పర్సనాలిటీ రావడం అతని అదృష్టం'' అని! అని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగబాబు కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్‌పై ఓ నెటిజన్ 'బాద్ షా'లో ఎన్టీఆర్ పోలీస్ రోల్ చేశారని, ఆయన మీద నాగబాబు సెటైర్ వేశారంటూ పోస్ట్ చేయడంఓత ఫ్యాన్ వార్ మొదలైంది. హిందీ సినిమా 'జంజీర్'లో రామ్ చరణ్ మీద నాగబాబు సెటైర్స్ వేశారని ఇంకొకరు పోస్ట్ చేశారు. దాంతో మెగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య రగడ మొదలైంది.