By: ABP Desam | Updated at : 29 Dec 2022 01:20 PM (IST)
Edited By: Mani kumar
Image Credit: Srinivasaa Silver Screen/Twitter
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ‘బంగార్రాజు, థాంక్యూ’తో పాటు లాల్ సింగ్ చడ్డా’ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు నాగ చైతన్య. ఆయన రీసెంట్ గా నటిస్తోన్న చిత్రం ‘కస్టడీ’. ఈ మూవీకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీను తెలుగు, తమిళ్ లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ లో నాగ చైతన్య ఎన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ‘కస్టడీ’ సినిమాను వచ్చే ఏడాది మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ సినిమాను చాలా పగడ్బందీగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందుకే అప్డేట్ ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా రిలీజ్ డేట్ విషయంలోనూ సింబాలిక్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇటీవలే నాగ చైతన్య పుట్టిన రోజు నాడు ‘కస్టడీ’ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో చైతన్య పోలీస్ కానిస్టేబుల్ డ్రెస్ లో ఇంటెన్సివ్ లుక్ లో కనిపించి సినిమాపై ఆసక్తి క్రియేట్ చేశాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలసి ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇలా ఇద్దరూ కలసి ఒకే సినిమాకు పనిచేయడం ఇదే తొలిసారి. ఇక ఈ చిత్రం లో కృతి శెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. వీరిద్దరూ కలసి ‘బంగార్రాజు’ సినిమాలో కనిపించారు. దీంతో ఈ మూవీపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక స్టార్ నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కనిపించనున్నారు.
ఇక నాగ చైతన్య తదుపరి సినిమాల విషయానికొస్తే.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘దూత’ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు చైతూ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ విడుదల కావాల్సి ఉండగా స్ట్రీమింగ్ మాత్రం ఆలస్యం అవుతోంది. గతంలో చైతూ, విక్రమ్ కె కూమార్ కాంబో సినిమా ‘థాంక్యూ’ ఆకట్టుకోలేకపోవడంతో మళ్లీ అదే కాంబినేషన్లో వెబ్ సిరీస్ అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనే సందేహంతో ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య నుంచి ఓ మంచి హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ ‘దూత’ వెబ్ సిరీస్ రానుందని టాక్. హారర్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్ లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read : 'గ్యాంగ్ లీడర్'లో ఎస్పీగా నటించిన వల్లభనేని జనార్ధన్ మృతి - ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
It's 🔒#Custody in theatres on May 12, 2023 👮#CustodyOnMay12🔥
— Srinivasaa Silver Screen (@SS_Screens) December 28, 2022
A @vp_offl Hunt 🎯@chay_akkineni @IamKrithiShetty @thearvindswami@SS_Screens @srinivasaaoffl @realsarathkumar #Priyamani @Premgiamaren @VennelaKishore @srkathiir @rajeevan69 @abburiravi @TimesMusicSouth #VP11 pic.twitter.com/v4yij3NI1s
Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్
Brahmamudi February 4th: రాజ్ కి నిజం చెప్పమన్న కావ్య- స్వప్న మీద కన్నేసిన రాహుల్
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!
Janaki Kalaganaledu February 4th: రామతో కన్నీళ్లు పెట్టించిన అఖిల్- వంట రాక తిప్పలు పడుతున్న మలయాళం
Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?
Government Websites Hacked: ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Diabetes: డయాబెటిస్ రోగులు ఈ టీని రోజూ తాగితే మందుల అవసరం ఉండదు
ITC Q3 Results: అంచనాలను మించి లాభపడ్డ ITC, Q3లో రూ.5 వేల కోట్ల ప్రాఫిట్