News
News
X

Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య

ఆమిర్ ఖాన్ లాంటి మంచి వ్యక్తితో నటించడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చిందంటున్నారు నాగ చైతన్య.

FOLLOW US: 

'లాల్ సింగ్ చద్దా' సినిమాలో తెలుగుదనం ఉట్టిపడుతుందని అంటున్నారు అక్కినేని నాగచైతన్య. ఆయన నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో నటించమని తనకు కాల్ వచ్చినప్పుడు నమ్మలేదని తర్వాత డైరెక్టర్ అద్వైత్ చందన్ వీడియో కాల్ చేసి మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించిందని చెప్పారు.

ఆమిర్ ఖాన్ లాంటి మంచి వ్యక్తితో నటించడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. ఆయనతో నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నట్టు చెప్పారు. ఆమిర్ ఖాన్ ఆన్ సెట్, ఆఫ్ సెట్ లో కూడా ఒకేలా ఉంటారని, కెమెరా ఆఫ్ చేసిన కూడా ఆయన పాత్ర నుంచి బయటకి రారని అంత డెడికేటెడ్ గా ఉంటారని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో తనది కేవలం 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఆమిర్ ఖాన్ తో కలిసి కనిపిస్తానని చెప్పారు. “ఇలాంటి క్యారెక్టర్ చెయ్యడం చాలా కష్టం. ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో నా పాత్ర పేరు బాలరాజు. గుంటూరు జిల్లా బొడిపాలెం దగ్గర పుట్టి పెరిగిన బాలరాజు ఆర్మీలో ఎలా చేరాడు అనేది చాలా చక్కగా చూపించారు. తెలుగు జిల్లాల్లోనూ ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. తెలుగుదనం ఉట్టిపడేలా ఆ ప్రాంతాలని చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది” అని చైతన్య చెప్పుకొచ్చారు. చిరంజీవి గారు పర్సనల్ గా తీసుకుని సినిమాను విడుదల చెయ్యడం చాలా హ్యాపీగా అనిపించిందని అన్నారు.

అద్వైత్ చందన్ చాలా గొప్ప డైరెక్టర్ తనని చాలా బాగా గైడ్ చేశాడని అన్నారు. "స్పెషల్ క్యారెక్టర్ చెయ్యడం అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు నేను ఏ సినిమాలోనూ స్పెషల్ క్యారెక్టర్ చెయ్యలేదు. ఇదే మొదటిది. ఆమిర్ గారి పక్కన చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన పక్కన చేసిన వారంతా షైన్ అవుతారు. ఆయన క్యారెక్టర్ తో పాటు పక్కన నటించిన వారికి కూడా మంచి గుర్తింపు వస్తుంది” అని అన్నారు. చైతుకి ఇది బాలీవుడ్ తొలి సినిమా.

1975 నుంచి తీసుకున్న సినిమా ఇది. కానీ పిరియాడిక్ సినిమా కాదని చెప్పారు. 'వెంకీ మావ' సినిమాలోనూ చైతు ఆర్మీ క్యారెక్టర్ చేసిన విషయం తెలిసిందే. కానీ దానికి దీనికి చాలా తేడా ఉందని అన్నారు. ఈ సినిమాలో కార్గిల్ లో జరిగిన ఒక సీన్ తీసుకుని చెయ్యడం జరిగిందని, ఇందులో కార్గిల్ యుద్ధం సీక్వెన్స్ ఉంటుందని చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న సినిమా 'లాల్ సింగ్ చద్దా'. ఈ సినిమాలో నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ సినిమా టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫారెస్ట్ గంప్‌'కి రీమేక్.ఇంతక ముందు ఆమీర్ తో  కలిసి సీక్రెట్ 'సూపర్ స్టార్'(2017) తీసిన అద్వైత్ చందన్ ఈ హిందీ వెర్షన్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా అమీర్‌ ఖాన్ ప్రొడక్షన్స్‌లో బ్యానర్‌లో రానుంది. 

Also Read : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Also Read : నేను వైఎస్సార్ అభిమానినే కానీ కమ్మ, కాపులను తిట్టలేదు - నితిన్ దర్శకుడు

Published at : 10 Aug 2022 07:59 PM (IST) Tags: Naga Chaitanya Aamir Khan Laal Singh Chaddha Laal Singh Chaddha movie Chaitanya Interview

సంబంధిత కథనాలు

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!