By: ABP Desam | Updated at : 27 Jan 2022 07:46 PM (IST)
'థాంక్యూ'లో నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య మాస్కోలో ఉన్నారు. రష్యా రాజధానిలో, విపరీతమైన చలిలో తిరుగుతున్నారు. ఒకవైపు ఇండియాలో సమంతతో ఆయన విడాకులు మీద వేడి వేడి చర్చ జరుగుతోంది. మరి, ఆయన ఎక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? షూటింగ్ చేస్తున్నారు. వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుంటున్నారు.
అక్కినేని కుటుంబంలో మూడు తరాల హీరోలతో 'మనం' వంటి మంచి సినిమా తీసిన దర్శకుడు విక్రమ్ కె. కుమార్. ఆయన దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న తాజా సినిమా 'థాంక్యూ'. ప్రస్తుతం మాస్కోలో షూటింగ్ చేస్తున్నారు. హీరోయిన్ రాశీ ఖన్నా, నటుడు ప్రకాష్ రాజ్ తదితరులు కూడా మాస్కో వెళ్లారు. ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. జనవరి 26న సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ పుట్టినరోజును కూడా అక్కడే సెలబ్రేట్ చేశారు.
మాస్కో షెడ్యూల్‌లో నాగచైతన్య, రాశీ ఖన్నాపై ఓ పాటను కూడా షూటింగ్ చేసినట్టు తెలిసింది. ఈ షెడ్యూల్ దాదాపు చివరకు వచ్చినట్టు సమాచారం. త్వరలో టీమ్ అందరూ ఇండియాకు రానున్నారు. ఈ సినిమాలో అవికా గోర్, మాళవికా నాయర్ మరో ఇద్దరు హీరోయిన్లు. ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Walking around in Moscow .. enjoying places my profession takes me .. I’m blessed #Thankyouthefilm pic.twitter.com/gF632dld4N
— Prakash Raj (@prakashraaj) January 27, 2022
NTR Jayanthi: కృష్ణుడిగా 17 సినిమాల్లో - ఎన్టీ రామారావు సినీ జీవితంలో ఈ విశేషాలు మీకు తెలుసా?
Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య
Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్ స్ట్రోక్
Krishna On Mahesh Babu: కృష్ణను స్టూడియో అంతా పరుగులు పెట్టించిన మహేష్ - అమ్మాయి గురించి నానా గొడవ
NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?