(Source: ECI/ABP News/ABP Majha)
Siva Karthikeyan: అతడి వలన రూ.20 కోట్లు నష్టపోయా - శివకార్తికేయన్ కి షాకిచ్చిన నిర్మాత
'మిస్టర్ లోకల్' సినిమా కోసం రూ.15 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తానని.. రూ.11 కోట్లు మాత్రమే చెల్లించారని మద్రాస్ హైకోర్టులో శివకార్తికేయన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
తమిళ హీరో శివ కార్తికేయన్ కి ప్రముఖ నిర్మాత, గ్రీన్ స్టూడియో అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా షాకిచ్చారు. 2019 మే 27న విడుదలైన 'మిస్టర్ లోకల్' సినిమా కోసం రూ.15 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తానని.. రూ.11 కోట్లు మాత్రమే చెల్లించారని మద్రాస్ హైకోర్టులో శివకార్తికేయన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మిగిలిన రూ.4 కోట్లు చెల్లించేలా నిర్మాతను ఆదేశించాలని కోరారు. ఈ కేసుపై విచారణ చేపట్టింది కోర్టు. ఈ విచారణలో శివకార్తికేయన్ వలన రూ.20 కోట్లు నష్టపోయినట్లు తెలుపుతూ పిటిషన్ దాఖలు చేశారు నిర్మాత జ్ఞానవేల్ రాజా.
నిజానికి 'మిస్టర్ లోకల్' కథ తనకు నచ్చలేదని.. కానీ రాజేష్ అనే వ్యక్తిని డైరెక్టర్ గా పెట్టి సినిమా చేయడం కోసం శివకార్తికేయన్ పట్టుబట్టి తనతో సినిమాపై పెట్టుబడి పెట్టించాడని జ్ఞానవేల్ రాజా తెలిపారు. అందుకే ఈ సినిమాను నిర్మించాల్సి వచ్చిందని పిటిషనల్ లో పేర్కొన్నారు. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతుండగా.. శివకార్తికేయన్ ఇప్పుడు తనపై ఎందుకు కేసు పెట్టాడని ప్రశ్నించారు జ్ఞానవేల్ రాజా.
తాను నష్టపోయినందుకు శివకార్తికేయన్ కి అపరాధం విధించి.. తనపై ఉన్న కేసుని కొట్టివేయాల్సిందిగా జ్ఞానవేల్ రాజా కోర్టుని కోరారు. ప్రస్తుతం ఈ హీరో, నిర్మాతల మధ్య వైరం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. శివకార్తికేయన్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోపక్క నిర్మాతగా సినిమాలను నిర్మిస్తున్నారు. అలానే సింగర్ గా, లిరిక్స్ రైటర్ గా బిజీగా గడుపుతున్నారు.
రీసెంట్ గా కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'అరబిక్ కుతు' సాంగ్ ను శివకార్తికేయనే రాశారు. ఈ పాటతో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ హీరో నటించిన 'డాన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా మార్చిలోనే విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది.
Also Read: 'శర్మాజీ నమ్‌కీన్' రివ్యూ: రిషి కపూర్ ఆఖరి సినిమా - వయసుతో పనేంటి?
View this post on Instagram