అన్వేషించండి

Mr Bachchan Movie: వైబ్రెంట్ బీట్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్- ‘మిస్టర్ బచ్చన్‘ నుంచి మరో సింగిల్, రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Telugu Cinema News | రవితేజ హీరో తెరకెక్కుతున్న మూవీ ‘మిస్టర్ బచ్చన్‘. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మరో అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు.

Mr Bachchan Fourth Single Nallanchu Thellacheera Song: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌’. గ్లామర్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌‌ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఆగష్టు 15న విడుదలకానుంది. మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ మాసీ యాక్షన్ తో పాటు అదిరిపోయే డైలాగ్స్ తో అదుర్స్ అనిపించింది. ఈ నేపథ్యంలో మేకర్స్ మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

ఆగష్టు 12న ఊరమాస్ సింగిల్ విడుదల

‘మిస్టర్ బచ్చన్’ నుంచి మరో ఊరమాస్ సాంగ్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. వైబ్రెంట్ బీట్స్, మాసీ లిరిక్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ తో కూడిని ఫోర్త్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ‘తెల్లంచు నల్లచీర’ అంటూ సాగే ఈ పాటను ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పింది.  ఈ మేరకు సోషల్ మీడియా వేదిగా ఓ పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. ఇందులో రవితేజ, భాగ్యశ్రీ మాసీ స్టెప్పులతో దుమ్మురేపుతున్నట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే వచ్చిన పాటలు ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకోవడంతో ఈ పాట కూడా మాంచి ఊపు ఇవ్వనుందని భావిస్తున్నారు.

యు/ఎ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు

అటు ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకు సంబంధించి సెన్సార్ పనులు కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేశారు. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 38 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. కామెడీ, రొమాన్స్, యాక్షన్ తో ‘మిస్టర్ బచ్చన్’ ఎంటర్ టైన్ చేయనుంది. ఈ సినిమాలో రవితేజ ఇన్ కమ్ టాక్స్ అధికారిగా కనిపించనున్నారు. సీనియర్ నటుడు జగపతి బాబు నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. ముఖ్యంగా రవితేజ, జగపతి బాబు మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది.  

మూడో సినిమా హిట్ కొట్టేనా?

ఇప్పటికే రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో ‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాలు వచ్చాయి. ‘షాక్’ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా, ‘మిరపకాయ్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు. వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న రవితేజ ఖాతాలో మరో హిట్ పడుతుందని  దీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సింగీతం అందిస్తుండగా, అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.  

Read Also: రెండు నెలల ముందే వచ్చేస్తోన్న 'కంగువ' ట్రైలర్‌ - రిలీజ్‌ ఎప్పుడంటే...  

టాప్ హెడ్ లైన్స్

Super Subbu Web Series Review - సూపర్ సుబ్బు రివ్యూ: Netflixలో సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్ - సందీప్ కిషన్ & టీమ్ ఎలా చేశారంటే?
సూపర్ సుబ్బు రివ్యూ: Netflixలో సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్ - సందీప్ కిషన్ & టీమ్ ఎలా చేశారంటే?
Naga Bandham Ticket Offer : రావు బహదూర్ Vs నాగబంధం - టికెట్ రేట్స్ To వన్ ప్లస్ వన్ ఆఫర్... ఆడియన్స్‌కు మేకర్స్ బిగ్ ఆఫర్
రావు బహదూర్ Vs నాగబంధం - టికెట్ రేట్స్ To వన్ ప్లస్ వన్ ఆఫర్... ఆడియన్స్‌కు మేకర్స్ బిగ్ ఆఫర్
Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Ketan Agarwal Lohagad Fort death case: కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
Embed widget