By: ABP Desam | Updated at : 06 Jun 2023 03:10 PM (IST)
మౌని రాయ్ (Image Credits: Mouni Roy/Instagram)
Badmash Restaurant : మౌని రాయ్ (Mouni Roy) కేవలం అద్భుతమైన నటి మాత్రమే కాదు ఇప్పుడు వ్యాపారవేత్త కూడా. బద్మాష్(Badmaash) పేరుతో ఆమె తాజాగా ఓ కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించింది. జూన్ 4న ముంబైలో రాత్రి సమయంలో ఈ రెస్టారెంట్ ను ఓపెన్ చేసింది. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటొలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఈ కార్యక్రమానికి దిశా పటాని, అంకితా లోఖండే, మందిరా బేడి, కరణ్ కుంద్ద్రా వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పిక్స్ ను షేర్ చేసిన మౌని రాయ్.. బద్మాష్ లాంచ్ గ్రాండ్ గా జరిగిందని పేర్కొంది. ఈ రెస్టారెంట్ ద్వారా నోరూరించే రుచులను అందిస్తామని ఆమె హామీ ఇచ్చింది. ఈ ఈవెంట్ వచ్చి తనకు అండగా నిలిచిన అతిథులకు, స్నేహితులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. దాంతో పాటు #BadmaashOpening #FoodieFiesta #TasteBudDanceParty అనే హ్యాష్ ట్యాగ్ లను జత చేసింది. ఇక ఈ ప్రత్యేకమైన రోజు కోసం, మౌని రాయ్ అద్భుతమైన బ్లాక్ బాడీకాన్ దుస్తులను ఎంచుకుంది. ఇక ఈ పోస్ట్‌కు పలువురు సెలబ్రెటీలు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. సృతి ఝా, ఆష్కా గోరాడియా గోబ్లే, నిర్మాత అపూర్వ మెహతా, గాయకుడు రాహుల్ వైద్య బ్రహ్మాస్త్ర మౌని రాయ్ ను అభినందిస్తూ కామెంట్స్ చేశారు.
'నాగిని' సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు మౌని రాయ్ దగ్గరైంది. బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇటీవలే వెండితెరపైనా మెరుస్తోంది. 'తుమ్ బిన్2', 'గోల్డ్' చిత్రాలతో పాటు 'కేజీఎఫ్'లో ఓ ఐటెం సాంగ్‌లోనూ నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాదు ఇటీవల జరిగిన 'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్'లో మౌనీ రాయ్ హల్‌చల్ చేసింది. అదిరిపోయే అవుట్ ఫిట్‌లో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన ఈ భామకు సంబంధించిన పలు ఫొటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ట్రెండీ పోజులతో స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేసే ఈ ముద్దు గుమ్మ.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న పిక్స్‌ను పంచుకుంది. సిల్వర్ అండ్ వైట్ కలర్ గౌన్‌లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ.. బ్లాక్ స్పెక్ట్స్ ధరించి మైండ్ బ్లోయింగ్ పోజులు ఇచ్చింది మౌనీ రాయ్. ఈ ఫొటోలు నెటిజన్లను తెగ ఆగట్టుకున్నాయి.
గతేడాది దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను పెళ్లి చేసుకున్న మౌని రాయ్.. వివాహ జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తోంది. ఓ పక్క ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూనే.. మరో పక్క సినిమాలతోనూ అభిమానులను అలరిస్తోంది. చివరగా 'బ్రహ్మస్త్ర' సినిమాలో కీరోల్ ప్లే చేసిన ఆమె.. రణబీర్ కపూర్, అలియా భట్, షారూఖ్ ఖాన్ సరసన నటించింది. ప్రస్తుతం మౌని రాయ్ 'ది వర్జిన్ ట్రీ' అనే మూవీలో నటిస్తోంది.
Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్
Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?
Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ
Hi Nanna: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
/body>