By: ABP Desam | Updated at : 08 Sep 2023 06:59 PM (IST)
మోటో జీ84 5జీ సేల్ ప్రారంభం అయింది ( Image Source : Motorola India )
మోటో జీ84 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో స్టార్ట్ అయింది. ఈ మొబైల్‌లో కేవలం ఒక్క స్టోరేజ్ వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. కలర్ వేరియంట్లు మాత్రం మూడు అందుబాటులో ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై మోటో జీ84 5జీ పని చేయనుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. 2022లో లాంచ్ అయిన మోటో జీ82 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.
మోటో జీ84 5జీ ధర, సేల్ వివరాలు
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ మోడల్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ కూడా లభించనుంది. వివా మాగెంటా, మార్ష్‌మాల్లో బ్లూ కలర్ ఆప్షన్లలో మోటో జీ84 5జీ కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు మిడ్‌నైట్ బ్లూ 3డీ అక్రిలిక్ గ్లాస్ ఫినిష్ మోడల్ కూడా మార్కెట్లోకి వచ్చింది.
మోటో జీ84 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. డిస్‌ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1300 నిట్స్‌గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై మోటో జీ84 5జీ పని చేయనుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా మరింత పెంచుకునే అవకాశం ఉంది.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై మోటో జీ84 5జీ రన్ కానుంది. ఒక సంవత్సరం పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌కు అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను కంపెనీ అందించింది.
మోటో జీ84 5జీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఐపీ54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. 5జీ, జీపీఎస్, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు కూడా మోటో జీ84లో ఉన్నాయి.
Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Chiranjeevi: మెగాస్టార్ నట ప్రస్థానానికి 45 ఏళ్ళు - రామ్ చరణ్ భావోద్వేగం
2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?
'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!
Bigg Boss Season 7 Telugu: పుంజుకుంటున్న ప్రిన్స్, ఆ ఇద్దరికీ గండం - మతపరమైన వ్యాఖ్యలతో ఆ కంటెస్టెంట్ ఔట్?
ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్ 279
ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు
చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
/body>