By: ABP Desam | Updated at : 25 Jul 2021 06:30 PM (IST)
shilpa shetty
అశ్లీల చిత్రాల చిత్రీకరణ ఆరోపణలతో పోలీసుల అదుపులో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కంపెనీలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు ఈ కేసుకు సంబంధించి సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు వారు సీబీఐని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ వివరాల్ని వెల్లడించేందుకు రాజ్‌కుంద్రా సహకరించడం లేదని క్రైం బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చిన నలుగురు ఉద్యోగులు ఈ కేసులో కీలకంగా మారనున్నారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మేజిస్ట్రేట్ సమక్షంలో త్వరలో వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ముంబయిలోని రాజ్‌కుంద్రాకు చెందిన వియాన్ ఇండస్ట్రీస్ కార్యాలయంలో శనివారం పోలీసులు సోదాలు నిర్వహించారు. వీరికి ఓ లాకర్ లభ్యమైనట్లు తెలుస్తోంది. అందులో పలు వ్యాపార ఒప్పందాలు, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పత్రాలు లభ్యమైనట్లు సమాచారం. క్రైం బ్రాంచ్ వీటిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాకర్‌ని రహస్యంగా ఉంచారని.. అందుకే గతంలో నిర్వహించిన సోదాల్లో ఇది బయటపడలేదని సమాచారం.
ఏంటి కేసు..
పోర్న్ సినిమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తూ.. వాటిని కొన్ని మొబైల్ యాప్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లుగా అభియోగాలతో రాజ్ కుంద్రాను.. ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల చేతిలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం
బ్రిటన్‌లోని తన సమీప బంధువు ప్రదీప్ బక్షితో కలిసి రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల దందాను నిర్వహిస్తున్నట్లు వాట్సప్ గ్రూప్ చాటింగ్, ఈ-మెయిళ్ల ద్వారా వెల్లడైనట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ప్రదీప్ బక్షికి బ్రిటన్‌లో కెన్రిన్ అనే నిర్మాణ సంస్థ ఉంది.
కుంద్రా బాలీవుడ్‌లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతులు, మోడళ్లను అశ్లీల చిత్రాల్లో నటించేలా ఒప్పించి.. పోర్న్ మూవీస్ తీస్తున్నారని.. ఇందుకోసం ఏజెంట్ల ద్వారా కెన్రిన్ సంస్థ నిధులు సమకూర్చిందని.. చిత్రీకరణ తర్వాత కుంద్రా టీం వీడియోలను కెన్రిన్ సంస్థకు ఓ అప్లికేషన్ ద్వారా పంపిస్తోందని పోలీసులు చెబుతున్నమాట. భారత చట్టాలను తప్పించుకునేందుకు ఆ వీడియోలను బ్రిటన్ నుంచి హాట్‌షాట్స్ యాప్‌తో పాటు మరికొన్ని యాప్‌లలోనూ అప్‌లోడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది..
ఈ పోర్న్ కంటెంట్‌ను చూసేందుకు ఛార్జీలు వసూలు చేసేవారని.. దీని ద్వారా కుంద్రా కోట్ల రూపాయలు ఆర్జించాడని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఇప్పటివరకూ ఈ కేసులో 11 మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.7.5 కోట్లను సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. కుంద్రాపై నేరం రుజువైతే 7 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అతడికి జులై 23 వరకూ కోర్టు పోలీస్ కస్టడీ విధించింది
Jagadhatri December 7th Episode: సక్సెస్ ఫుల్ గా ప్లాన్ అమలు చేసిన ధాత్రి.. తెలివిగా బూచిని ఇరికించేసిన కేదార్, ధాత్రి!
‘హాయ్ నాన్న’ రివ్యూ, ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమాలో తెలుగమ్మాయికి ఛాన్స్
Devil: థియేటర్లలోకి 'డెవిల్' వచ్చేది ఆ రోజే - కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండ్ కిక్!
Abhiram Daggubati Marriage : ఓ ఇంటివాడైన దగ్గుబాటి వారసుడు - అభిరామ్ పెళ్లి ఫోటోలు చూశారా?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి
revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం
/body>