News
News
X

Money Heist Part 5 Trailer: ‘మనీ హీస్ట్’ పార్ట్ 5 ట్రైలర్: బ్యాంక్‌లోకి ప్రొఫెసర్ ఎంట్రీ.. తన ముఠాను రక్షిస్తాడా?

మనీ హీస్ట్.. వాల్యూమ్ 2లోని పార్ట్ 5 ట్రైలర్ వచ్చేసింది. ఇన్ని రోజులు పోలీసులకు కనిపించకుండా ఎత్తులు వేసిన ప్రొఫెసర్ నేరుగా బ్యాంక్ వద్దకు చేరుకోవడంతో ఆసక్తి నెలకొంది.

FOLLOW US: 

‘మనీ హీస్ట్’ ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకులు వీక్షించే ఈ వెబ్ సీరిస్ చివరి దశకు వచ్చేసింది. డిసెంబరు 3 నుంచి స్ట్రీమింగ్ కానున్న వాల్యూమ్ 2, పార్ట్ 5 ఎపిసోడ్స్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ‘నెట్ ఫ్లిక్స్’ ఓటీటీ సంస్థ రిలీజ్ చేసింది. దీపావళి సందర్భంగా స్పానిష్ ట్రైలర్‌ను విడుదల చేసింది. త్వరలో తెలుగుతోపాటు ఇతర భాషల ట్రైలర్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

 మొదటి పార్ట్ కంటే రక్తికట్టించే విధంగా రెండో పార్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ప్రసారమైన పార్ట్ 2లో సైన్యం రంగంలోకి దిగడంతో ప్రొఫెసర్ టీమ్‌ కష్టాల్లో పడింది. తమ టీమ్ సభ్యులను కాపాడేందుకు టోక్యో ఆత్మహుతికి పాల్పడి సైనికులను చంపేసింది. మరోవైపు ప్రొఫెసర్ కూడా పోలీస్ ఆఫీసర్ చేతికి చిక్కాడు. అయితే, ఆమె ప్రసవంతో పరిస్థితులు మారిపోయాయి. ఆ పోలీస్ ఆఫీసర్ ప్రొఫెసర్‌కు సాయం చేస్తుందా? లేదా అతడిని పట్టుకుని మళ్లీ తన సత్తా చాటుతుందా అనేది చూడాలి. 

తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో ప్రోఫెసర్ తన డెన్‌ను వీడి బ్యాంక్ వద్దకు వస్తున్నట్లు చూపించారు. రెడ్ కలర్ కారులో బ్యాంక్ వద్దకు చేరుకున్న ప్రొఫెసర్‌కు సైన్యం లోపలికి వెళ్లేందుకు దారి ఇవ్వడాన్ని ట్రైలర్‌లో చూడవచ్చు. అయితే, ప్రొఫెసర్ అక్కడికి చేరుకోడానికి ముందు పోలీస్ ఆఫీసర్‌తో పోరాడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఛేజింగ్ సీన్లను ట్రైలర్‌లో చూపించారు. మరో వైపు ఓ మహిళ సైనికురాలు బ్యాంకులో ప్రొఫెసర్ టీమ్‌తో పోరాడుతున్న సన్నివేశాలు కూడా ఉన్నాయి.  

“మేము ఒక మిషన్‌ను పూర్తి చేయడానికి ఇక్కడకు వచ్చాం. ఈ దోపిడీకి ముగింపు పలకండి” అని సైన్యం వార్నింగ్ ఇస్తారు. పలెర్మో (రోడ్రిగో డి లా సెర్నా)  స్పందిస్తూ ‘‘మనం ఇక్కడి నుంచి బయట పడగలమా అని సందేహంగా ఉంది’’ అని అంటాడు. హెల్సింకి (డార్కో పెరిక్) “నువ్వు నన్ను ఇక్కడి నుంచి బయటకు పంపిస్తావు. నువ్వు నాకు వాగ్దానం చేసావు’’ అని అంటాడు. బ్యాంక్‌లోకి ఎంట్రీ తర్వాత ప్రొఫెసర్ ఏం చేస్తాడు? సైన్యానికి లొంగిపోతారా? లేదా మరో కొత్త ప్లాన్‌తో తప్పించుకుంటారా? అయితే, ప్రొఫెసర్‌ ఎత్తులు వేయడంలో దిట్ట.. ఈ సీజన్‌లో ఏ ప్లాన్ లేకుండా పోలీసులకు లొంగిపోతే ప్రేక్షకులకు నిరాశ తప్పదు. మరి, ఈ సీరిస్ ఇంతటితో ముగుస్తుందా.. కొనసాగుతుందా అనేది తెలుసుకోవాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.

‘మనీ హీస్ట్’ ట్రైలర్:  

Also Read: మెగాఫ్యామిలీతో బన్నీ సందడి... వైభవంగా దీపావళి వేడుకలు
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' రివ్యూ.. మంచి నవ్వులు వచ్చాయి! కానీ...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Nov 2021 10:52 AM (IST) Tags: Money Heist Part 5 trailer Money Heist 5 trailer Money Heist Part 2 trailer Money Heist Trailer మనీ హీస్ట్ ట్రైలర్ మనీ హీస్ట్ 5 ట్రైలర్

సంబంధిత కథనాలు

Rana Daggubati : అన్నీ డిలీట్ చేసిన రానా - ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా లేదు

Rana Daggubati : అన్నీ డిలీట్ చేసిన రానా - ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా లేదు

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Sravanthi Instagram Hacked: ‘బిగ్ బాస్’ బ్యూటీ స్రవంతికి హ్యాకర్స్ షాక్, అవన్నీ డిలీట్ - ఇవి మాత్రమే మిగిలాయ్!

Sravanthi Instagram Hacked: ‘బిగ్ బాస్’ బ్యూటీ స్రవంతికి హ్యాకర్స్ షాక్, అవన్నీ డిలీట్ - ఇవి మాత్రమే మిగిలాయ్!

Pawan Kalyan Mahesh Babu : ఆ రోజు మహేష్ బాబుకు మద్దతుగా నిలిచా - పవన్ కళ్యాణ్ 

Pawan Kalyan Mahesh Babu : ఆ రోజు మహేష్ బాబుకు మద్దతుగా నిలిచా - పవన్ కళ్యాణ్ 

Chiranjeevi Aamir Khan : మెగాస్టార్‌తో అటువంటి సినిమా సాధ్యమేనా?

Chiranjeevi Aamir Khan : మెగాస్టార్‌తో అటువంటి సినిమా సాధ్యమేనా?

టాప్ స్టోరీస్

Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు

Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు

Telangana Cabinet : 11న తెలంగాణ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ !

Telangana Cabinet : 11న తెలంగాణ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ !

Liger Team At Mumbai : వాళ్ళిద్దరి బాండింగ్ అలాంటిది - ముంబైలో లవ్లీ 'లైగర్' జోడీ  

Liger Team At Mumbai : వాళ్ళిద్దరి బాండింగ్ అలాంటిది - ముంబైలో లవ్లీ 'లైగర్' జోడీ