అన్వేషించండి

Miss Shetty Mr Polishetty Trailer: ‘సీసీటీవీ కెమెరా ఉన్నా ఏం పర్లేదు, వైరల్ అయిపోతాం’ - ఫన్నీగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్!

నవీన్ పోలిశెట్టి, అనుష్కల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ విడుదల అయింది.

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. మంచి ఫన్ ఎలిమెంట్స్‌తో, ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అనిపించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. తెలుగులో కామెడీ మీద బేస్ అయిన మంచి లవ్ స్టోరీ వచ్చి చాలా కాలం అయింది. ఆ లోటును ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తీర్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ ఎక్సలెంట్ అని చెప్పవచ్చు.

‘అమ్మాయిలకి అబ్బాయిలు నచ్చాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది బ్రో… కానీ అబ్బాయిలకి లిస్ట్ ఏంవుండదు. జస్ట్ అమ్మాయి అయితే చాలు!’, ‘సీసీటీవీ కెమెరా ఉంది అక్కడ. నాకేం ప్రాబ్లం లేదు. వైరల్ అయిపోతాం.’ లాంటి నేటి యూత్ కనెక్ట్ అయ్యే ఫన్నీ డైలాగ్స్‌తో ట్రైలర్‌ను నింపేశారు. ఈ డైలాగులకు నవీన్ పోలిశెట్టి మార్కు డైలాగ్ డెలివరీ యాడ్ అయి మరింత హిలేరియస్‌గా మారిపోయాయి. ఇది సాధారణ లవ్ స్టోరీ మాత్రమే కాదని, అంతకు మించిందేదో ఉందనే హింట్ కూడా ట్రైలర్‌లో ఇచ్చారు.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క శెట్టి ఫేమస్ షెఫ్ పాత్రలో నటించారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించారు. సందీప్ కిషన్, జగపతి బాబు, రెజీనా, కళ్యాణి ప్రధాన తారలుగా 'రారా కృష్ణయ్య' అనే చిత్రాన్ని తెరకెక్కించిన పి. మహేష్ బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇది అనుష్కకు 48వ చిత్రం. యూవీ క్రియేషన్స్, అనుష్క కాంబినేషన్‌లో 'మిర్చి', 'భాగమతి' సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో హ్యాట్రిక్ మీద కన్నేశారు.

తొలుత 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాని ఆగస్టు 4వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా వాయిదా వేసినట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. తర్వాత ఆగస్టు 18వ తేదీన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విడుదల కావచ్చని వార్తలు వచ్చాయి. ఆ ఊహాగానాలకు తెర దించుతూ సెప్టెంబర్ 7వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అదే రోజు విడుదల కానున్న షారుక్ ఖాన్ ‘జవాన్’ సినిమాతో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' పోటీ పడనుంది.

ఇక అనుష్క సినిమా థియేటర్లలోకి వచ్చి ఐదేళ్ళు పైనే అవుతోంది. 'భాగమతి' 2018లో విడుదల అయింది. ఆ తర్వాత ఆమె నటించిన 'నిశ్శబ్దం' అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి'లో చిన్న అతిథి పాత్రలో కనిపించారు. కాబట్టి అనుష్క సినిమా కోసం అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. 2021లో వచ్చిన ‘జాతి రత్నాలు’ తర్వాత నవీన్ పోలిశెట్టి నటిస్తున్న సినిమా ఇదే. దాదాపు రెండేళ్లు ఈ సినిమా మీదనే గడిపేశారు నవీన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాను కూడా ప్రకటించారు. దాని షూటింగ్ త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా సినిమా శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ సంస్థ దక్కించుకుంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Transfer Trimurthulu Teaser : ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు వెరీ స్ట్రిక్ట్ - పదేళ్ల తర్వాత హీరోగా వడ్డే నవీన్ రీఎంట్రీ
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు వెరీ స్ట్రిక్ట్ - పదేళ్ల తర్వాత హీరోగా వడ్డే నవీన్ రీఎంట్రీ
Jagadhatri Serial Today May 21th:జగధాత్రిని ముఖం కూడా చూపించవద్దని సుధాకర్‌ ఎందుకు అన్నాడు..?కౌషికికి యువరాజు గన్‌ ఎందుకు గురిపెట్టాడు..?
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రిని ముఖం కూడా చూపించవద్దని సుధాకర్‌ ఎందుకు అన్నాడు..?కౌషికికి యువరాజు గన్‌ ఎందుకు గురిపెట్టాడు..?
Lakshimi Raave Maa Intiki Serial Today May21th: లక్ష్మీని దెబ్బతీయడానికి త్రిష సాయంకోరిన ప్రియంవద...కాలేజీలో కొట్టుకున్న విక్రమ్‌,మ్యాడీ
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: లక్ష్మీని దెబ్బతీయడానికి త్రిష సాయంకోరిన ప్రియంవద...కాలేజీలో కొట్టుకున్న విక్రమ్‌,మ్యాడీ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: వారసుడి కోసం విహారి పూజలు! కళ్లు తెరిచిన లక్ష్మీ.. విహారిని చూస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: వారసుడి కోసం విహారి పూజలు! కళ్లు తెరిచిన లక్ష్మీ.. విహారిని చూస్తుందా!

వీడియోలు

MI vs KKR IPL 2026 Highlights | ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఊచకోత
KKR Bowlers Destroy MI Batting IPL 2026 | ముంబైకు చుక్కలు చూపించిన నరైన్, గ్రీన్
Sanju Samson vs Heinrich Klaasen | క్లాసెన్‌తో గొడవకు ఎండ్ కార్డ్ వేసిన సంజూ
Virat Kohli Comments On Captaincy Stress | ద్రవిడ్ చేసిన సాయంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Shocking Comments IPL 2026 | కేకేఆర్ చేతిలో ఓటమిపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nowhera Shaik Arrested: హీరా గోల్డ్ స్కామ్‌ నౌహీరా షేక్ అరెస్టు! గురుగ్రామ్‌లో చిక్కిన డాన్!
ఖురాన్ టీచర్ నుంచి కుబేరురాలి వరకు... హీరా గోల్డ్ కుంభకోణంలో అరెస్టైన నౌహీరా షేక్‌ బ్యాక్‌గ్రౌండ్!
Heatwave in Andhra Pradesh and Telangana:తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
Transfer Trimurthulu Teaser : ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు వెరీ స్ట్రిక్ట్ - పదేళ్ల తర్వాత హీరోగా వడ్డే నవీన్ రీఎంట్రీ
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు వెరీ స్ట్రిక్ట్ - పదేళ్ల తర్వాత హీరోగా వడ్డే నవీన్ రీఎంట్రీ
IPL 2026 GT VS CSK Result Update: చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. రాణించిన సుద‌ర్శ‌న్, గిల్, సిరాజ్, రాబ‌డ‌
Hardik Pandya Fined: MI కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా - KKR మ్యాచ్ లో ప్రవర్తనపై సీరియస్ యాక్షన్
MI కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా - KKR మ్యాచ్ లో ప్రవర్తనపై సీరియస్ యాక్షన్
Numerology: మీ పుట్టిన తేదీ 2,11,20 లేదా 29 అయితే మిమ్మల్ని అందరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?
మీ పుట్టిన తేదీ 2,11,20 లేదా 29 అయితే మిమ్మల్ని అందరూ ఎందుకు ఇష్టపడతారో తెలుసా?
Chennai Super Kings  Knock Out: చెన్నై సూపర్ కింగ్స్ ఓట‌మితో ఫ్లే ఆఫ్స్ రేసులో నిలిచిన నాలుగు జట్లు.. హోరాహోరీ పోరు
చెన్నై సూపర్ కింగ్స్ ఓట‌మితో ఫ్లే ఆఫ్స్ రేసులో నిలిచిన నాలుగు జట్లు.. హోరాహోరీ పోరు
ఈ రోజు రాశిఫలాలు 22 మే 2026: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు
ఈ రోజు రాశిఫలాలు 22 మే 2026: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు
Embed widget