News
News
X

Chiranjeevi: వినాయక్‌ - చిరు కాంబోలో తమిళ మూవీ రీమేక్? మళ్లీ అజీత్ సినిమాయేనా?

చిరంజీవి మరోసారి తమిళ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట. దర్శకుడు వినాయక్‌ కాంబినేషన్‌లో...

FOLLOW US: 
Share:

మెగాస్టార్ చిరంజీవి రీమేక్‌ల బాటపట్టినట్టున్నారు. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘కత్తి’ సినిమా రీమేక్‌ మూవీ ‘ఖైదీ నెం150’తో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి వి.వి వినాయక్‌ దర్శకత్వం వహించారు. అయితే చిరు రీఎంట్రీ సినిమా కావడంతో ఫ్యాన్స్‌ ఎగ్జైట్‌ అయ్యారు. కానీ ఆయన రీఎంట్రీకి పడాల్సిన హిట్టు మాత్రం పడలేదు. ఆ తర్వాత కూడా చెప్పుకోదగిన హిట్స్ రాలేదు. చివరికి కొడుకు రామ్‌చరణ్‌తో కలిసి నటించిన ‘ఆచార్య’ కూడా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే, చిరంజీవికి ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు కాస్త రిలీఫ్ ఇచ్చాయనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చిరు మరో తమిళ సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. మళ్లీ వినాయకే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. ఇంతకీ చిరు-వినాయక్‌ కలిసి ఏ తమిళ సినిమాను రీమేక్‌ చేయబోతున్నారో తెలుసా? అజిత్ నటించిన సూపర్‌ హిట్ సినిమా ‘విశ్వాసం’.

ఈ సినిమాను తమిళంలో మంచి విజయం అందుకుంది కాబట్టి తెలుగులో తీసినా అంతే బాగా ఆడుతుందని వినాయక్‌ అభిప్రాయపడ్డారట. ఇదే విషయాన్ని చిరుతో కూడా డిస్కస్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే చిరు మాత్రం ఇంకా తన అభిప్రాయాన్ని చెప్పలేదని టాక్‌. ఎందుకంటే.. ఆల్రెడీ చిరు చేతిలో ఒక రీమేక్‌ ఉంది. అది కూడా అజిత్ నటించిన సినిమానే. తమిళంలో బ్లాక్‌ బస్టర్ హిట్‌ అయిన ‘వేదాళం’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. దీనికి ‘భోళా శంకర్‌’ అనే టైటిల్‌ కూడా పెట్టేశారు. మెహర్‌ రమేష్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఒక తమిళ రీమేక్‌ సెట్స్‌పై ఉండటం వల్ల మరోసారి తమిళ రీమేక్‌ అంటే చిరు ఒప్పుకుంటారా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అజిత్-నయనతార జంటగా నటించిన ‘విశ్వాసం’ సినిమా తండ్రి - కూతుళ్ల ఎమోషనల్ బాండ్‌ నేపథ్యంతో తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇందులో జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్‌ డైరెక్షన్‌ క్యాటగిరీలో జాతీయ అవార్డు కూడా వరించింది.

ఇలాంటి తండ్రీ-కూతుళ్ల కాన్సెప్ట్‌కి చిరు అయితే పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతారని వినాయక్‌ భావించినట్లున్నారు. 90ల్లో వచ్చిన ‘డాడీ’ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. చిరు, సిమ్రాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఆ మూవీ కూడా తండ్రీ కూతుళ్ల నేపథ్యంలోనే ఉంటుంది. ఈ సినిమా ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. ఆ తర్వాత కాస్త అటు ఇటుగా ఉన్న ఇలాంటి కాన్సెప్ట్‌తోనే జై చిరంజీవ సినిమా వచ్చింది. ‘డాడీ’ సినిమాలో చిరు తన కూతురిని కోల్పోయి హాస్పిటల్‌ కట్టించడం కాన్సెప్ట్‌. అయితే.. ‘జై చిరంజీవ’లో తన మేనకోడలి హత్యకు ప్రతీకారం ఎలా తీర్చుకున్నారు అనే కాన్సెప్ట్‌తో వచ్చింది. కానీ అది అప్పటి సినీ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. కాస్త సీరియస్‌గా సాగాల్సిన సినిమాలో కామెడీ మోతాదును పెంచడమే ఇందుకు కారణం. కానీ ‘విశ్వాసం’ రీమేక్‌ మాత్రం చిరుకి గుర్తుండిపోయే కమ్‌బ్యాక్‌ ఇస్తుందని వినాయక్‌ స్ట్రాంగ్ ఫీలింగ్‌లో ఉన్నారట. మరి ఏ విషయం అన్నది అఫీషయల్‌గా ప్రకటిస్తే కానీ తెలీదు.

ఇకపోతే ‘భోళా శంకర్‌’ సినిమాలో కీర్తి సురేష్‌ చిరుకి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా చిరుకి జోడీగా నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మొన్న సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మాస్‌ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించారు. శ్రుతి హాసన్‌ కథానాయికగా నటించింది. బాబీ దర్శకత్వం వహించారు. 

Read Also: ‘RRR’కు మరో ప్రతిష్టాత్మక అవార్డు - ఈసారి ఏ కేటగిరికి వచ్చిందో తెలుసా?

Published at : 20 Jan 2023 01:23 PM (IST) Tags: Ajith VV Vinayak Remake Chiranjeevi Vishwasam

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham February 8th: బయటపడిన అభిమన్యు అసలు రంగు, మాళవిక బతుకు బస్టాండ్- మనసులతో ఊసులాడుకున్న వేద, యష్

Ennenno Janmalabandham February 8th: బయటపడిన అభిమన్యు అసలు రంగు, మాళవిక బతుకు బస్టాండ్- మనసులతో ఊసులాడుకున్న వేద, యష్

Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్

Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్

Guppedanta Manasu February 8th: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది

Guppedanta Manasu February 8th: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది

Jailer vs Indian 2: ఒకే రోజు కమల్, రజినీ సినిమాలు విడుదల, 18 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్!

Jailer vs Indian 2: ఒకే రోజు కమల్, రజినీ సినిమాలు విడుదల, 18 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్!

Prabhas Team Reaction : కృతితో ప్రభాస్ ఎంగేజ్‌మెంట్ - రెబల్ స్టార్ టీమ్ క్లారిటీ

Prabhas Team Reaction : కృతితో ప్రభాస్ ఎంగేజ్‌మెంట్ - రెబల్ స్టార్ టీమ్ క్లారిటీ

టాప్ స్టోరీస్

ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్‌

ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్‌

Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్‌ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు

Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్‌ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్