News
News
X

Chiranjeevi - Sushmita: కూతురుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి

ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె సుష్మిత కు ఓప్రత్యేకమైన బహుమతి ను అందజేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను సుష్మిత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

FOLLOW US: 
Share:

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. సాధారణంగా ఎవరైనా ఏదైనా ఒక రంగంలో రానిస్తుంటే వారి తర్వాత వారి వారసులు కూడా అదే రంగంలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. సినిమా రంగంలో కూడా ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. అయితే కొంతమంది మాత్రం వారి సొంత గుర్తింపు కోసం బ్యాగ్రౌండ్ ను పక్కనపెట్టి కష్టపడుతూ ఉంటారు. సినిమా రంగంలో కూడా ఎంతో మంది వారసులు అలా గుర్తింపు తెచ్చుకున్న వారు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కూడా అలాంటి గుర్తింపే సంపాదించారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం కృషి చేస్తున్నారు సుష్మిత.

ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె సుష్మిత కు ఓప్రత్యేకమైన బహుమతి   అందజేశారు. ఆమెకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ దుర్గాదేవి ప్రతిమను బహుకరించారు. అందుకు సంబంధించిన ఫోటోలను సుష్మిత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ‘‘మహిళా దినోత్సవం సందర్భంగా ఈ బహుమతి అందించడం చాలా ఆనందంగా ఉంది నాన్న. స్త్రీలను శక్తివంతులుగా దుర్గాదేవి కంటే దేనితో గొప్పగా వర్ణించగలం, ధన్యవాదాలు.’’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ చూసి మెగా అభిమానులు ఆమెకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

మెగా డాటర్లు బ్యాగ్రౌండ్ పక్కనపెట్టి వారికంటూ ప్రత్యేక గుర్తింపు కోసం కష్టపడుతున్నారు. ఇప్పటికే నాగబాబు కుమార్తె నిహారిక సినిమా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు చిరంజీవి పెద్ద కూతురు కూడా అదే బాటలో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈమె హీరోయిన్ గా కాకుండా మొదట కాస్ట్యూమ్ డిజైనర్ గా సినిమా కెరీర్ ను ప్రారంభించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150’ సినిమాకు సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. ఓ వైపు డిజైనర్ గా చేస్తూనే మరో వైపు ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఓ ప్రొడక్షన్ కంపెనీను ప్రారంభించారు. మొదట ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి పలు వెబ్ సిరీస్ లను నిర్మించారు. తర్వాత నటుడు సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అంతకముందు ‘సేనాపతి’ అనే సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు సుష్మిత. 

ఇక మెగా స్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తో మంచి హిట్ అందుకున్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ పత్యేక పాత్రలో నటించిగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా  రికార్డులు సాధించింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

View this post on Instagram
 
A post shared by Sushmita (@sushmitakonidela)

Published at : 09 Mar 2023 01:15 PM (IST) Tags: Megastar Chiranjeevi Chiranjeevi Sushmita

సంబంధిత కథనాలు

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Janaki Kalaganaledu April 1st: రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక

Janaki Kalaganaledu April 1st:  రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి