By: ABP Desam | Updated at : 15 Dec 2022 08:45 PM (IST)
Edited By: Mani kumar
image credit:Mythri Movie Makers/Instagram
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా నటించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది మూవీ టీమ్. యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఇటీవల సినిమాలో చిరు-శృతి హాసన్ తో ఓ పాట షూటింగ్ కోసం ఫ్రాన్స్ వెళ్లింది టీమ్. ఆ పాట చిత్రీకరణ పూర్తయిందన్న విషయాన్ని స్వయంగా మెగాస్టార్ ఓ వీడియో విడుదల చేసి మరీ చెప్పారు. అంతే కాదు అక్కడి లొకేషన్స్ ను వీడియోలో చూపించారు. వీడియో చివర్లో ఆ పాటకు సంబంధించి చిన్న లిరికల్ లైన్ కూడా లీక్ చేశారు చిరు. అది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియో వచ్చి కొన్ని గంటలు గడవక ముందే మరో అదిరిపోయే వీడియోతో మళ్లీ సందడి చేశారు చిరు.
ఇటీవల సినిమాలో విడుదల అయిన ‘బాస్ పార్టీ’ పాటను వింటూ చిరంజీవి మంచి జోష్ మీద ఉన్నట్లు కనిపించారు. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ‘బాస్ పార్టీ’ పాటను పాడుతుంటే.. చిరంజీవి ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోలో చిరంజీవి తో పాటు దర్శకుడు బాబీ, నిర్మాతలు యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్, దర్శకుడు సుకుమార్ లు కూడా ఉన్నారు. చిరంజీవి పాటకు వారు కూడా శృతి కలిపి ‘బాస్ పార్టీ’ పాటకు చిందులేస్తూ కనిపించారు.
ఈ వీడియో చూసిన మెగా అభిమానుల్లో కొందరు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం తెగ ఫీలైపోతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వడం లేదనే కోపంతో మైత్రీ మూవీ మేకర్స్‌ను ఫన్నీ మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ‘వీర సింహారెడ్డి’ కూడా సంక్రాంతి 12న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటల్ని విడుదల చేశారు మూవీ టీమ్. దీంతో ఇప్పుడు చిరంజీవి సినిమాలో రెండో పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయంలో ‘వాల్తేరు వీరయ్య’ టీమ్ ఎలాంటి సర్ప్రైజ్ లు ప్లాన్ చేసిందో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే చిరు సినిమా అప్డేట్ ల విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది.
Also Read : నేను బతికే ఉన్నా - నటి వీణా కపూర్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్
Megastar @KChiruTweets vibing with the team of #WaltairVeerayya while listening to the #BossParty for the first time 💥
— Mythri Movie Makers (@MythriOfficial) December 15, 2022
Vibe to #BossParty with your gang and share your versions with us 🔥@RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/Igb4sA1S6W
Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్
Brahmamudi February 4th: రాజ్ కి నిజం చెప్పమన్న కావ్య- స్వప్న మీద కన్నేసిన రాహుల్
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!
Janaki Kalaganaledu February 4th: రామతో కన్నీళ్లు పెట్టించిన అఖిల్- వంట రాక తిప్పలు పడుతున్న మలయాళం
Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?
Government Websites Hacked: ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Kapurthala Bhadas village: పెళ్లిలో వధువులు లెహంగాలు ధరించడానికి వీల్లేదు, రాత్రి 12 దాటితే ఫైన్ - గ్రామపంచాయతీ వింత రూల్స్
Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే మీ గోళ్ళు చెప్పేస్తాయ్