Ram Charan Favorite Films: రామ్ చరణ్ ఫేవరెట్ మూవీస్ ఇవేనట - ఆ సినిమా 50 సార్లు చూశాడట!
‘RRR’ స్టార్ రామ్ చరణ్, తాజాగా తనకు అత్యంత ఇష్టమైన సినిమాలేంటో చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన స్థానిక మీడియాలో మాట్లాడుతూ ఫేవరెట్ మూవీస్ లిస్ట్ రివీల్ చేశారు.
‘RRR’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆస్కార్ అవార్డుల వేడుక కోసం అమెరికాకు వెళ్లారు. మార్చి 12న ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డుల వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో చెర్రీ ప్రముఖ సామాజిక వేదిక అయిన లెటర్ బాక్స్డ్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రామ్ చరణ్ ఫేవరెట్ సినిమాలు ఇవే!
మీకు నచ్చిన ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాలేంటనే ప్రశ్నకు, నాలుగు సినిమాలు తనకు అత్యంత ఇష్టం అని చెప్పారు. వాటిని చాలా సార్లు చూసినట్లు వివరించారు. అందులో తొలి సినిమా ‘నోట్‌బుక్’, రెండో సినిమా ‘టెర్మినేటర్ 2’ మూడో సినిమా ‘గ్లాడియేటర్’ కాగా, నాలుగో సినిమా ‘బాస్టర్డ్స్’ అని చెప్పారు. ఇక భారతీయ సినిమాల్లోనూ తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాలున్నాయని వెల్లడించారు. ‘దాన వీరా సూర కర్ణ’, ‘మిస్టర్ ఇండియా’, ‘బాహుబలి’తో పాటు తాను నటించిన ‘రంగస్థలం’ సినిమాలున్నాయన్నారు. జేమ్స్ కామెరాన్ ‘టెర్మినేటర్2’ను అప్పట్లో వారానికి రెండు సార్లు చూసే వాడినని చెప్పారు. ఇప్పటి వరకు ఆ సినిమాను 50 సార్లు కంటే ఎక్కువ చూసినట్లు వివరించారు. క్వెంటిన్ టరాన్టినో కు సంబంధించిన అన్ని సినిమాలు తనకు అత్యంత ఇష్టమైనవి గా చెప్పుకొచ్చారు.
Ahead of #RRRMovie returning to US theaters this Friday, @AlwaysRamCharan shares his four favorites with Letterboxd. @RRRMovie #RRRForOscars pic.twitter.com/M8gSsEByk8
— Letterboxd (@letterboxd) March 1, 2023
చరిత్రకు ఒక్క అడుగు దూరంలో 'RRR’
చరిత్రకు ఒక్క అడుగు దూరంలో 'RRR: రౌద్రం రణం రుధిరం' చిత్రంలోని 'నాటు నాటు...' నిలిచింది. భారతీయ సినిమా నుంచి, అదీ తెలుగు సినిమా నుంచి ఆస్కార్ నామినేషన్ అందుకున్న తొలి పాటగా 'నాటు నాటు' చరిత్రకు ఎక్కింది. ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ వేదికపై 'నాటు నాటు...' సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఇద్దరూ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలో ఆస్కార్ స్టేజి మీద పాడే అవకాశం ఆ ఇద్దరికీ రావడం గొప్ప విషయం.
మార్చి 13 కోసం ఇండియా వెయిటింగ్!
మార్చి 13, 2023న ఆస్కార్ విజేతల వివరాలు వెల్లడిస్తారు. ఆ రోజు కోసం యావత్ భారతదేశం వెయిట్ చేస్తోంది. 'నాటు నాటు...'కు అవార్డు రావడం ఖాయం అని అభిమానులు ఆశిస్తున్నారు. 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో పోటీ పడటానికి మొత్తం 81 పాటలు అర్హత సాధించగా... అందులో 15 పాటలను మాత్రమే షార్ట్ లిస్టుకు ఎంపిక చేశారు. ఆ పదిహేనులో 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు...' ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత నామినేషన్ కూడా అందుకుంది. ఇప్పటికే ‘నాటు నాటు’ పాట పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. గోల్డెన్ గ్లోబ్ తో పాటు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను దక్కించుకుంది.
Read Also: చిక్కుల్లో షారుఖ్ భార్య - గౌరీ ఖాన్‌పై నాన్ బెయిలబుల్ కేసు