News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Varun tej: పెళ్లి వార్తలు పట్టించుకోకుండా పిజ్జా తింటున్నావా? వరుణ్ బ్రో! - లావణ్య కూడా అక్కడే?

టాలీవుడ్ ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య ల పెళ్లి మేటర్ హాట్ టాపిక్ గా మారింది. అందరూ దీనిపైనే చర్చ. అయితే వరుణ్ తేజ్ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుడా సరదాగా పిజ్జా తింటున్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

FOLLOW US: 
Share:

Varun Tej: టాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ గా మారింది. అదే మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి. గత కొంత కాలంగా వరుణ్, లావణ్య ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి దాాకా అటు వరుణ్ గానీ, ఇటు లావణ్య గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఉన్నట్టుండి గత కొన్ని రోజులుగా వరుణ్, లావణ్య ల పెళ్లి మ్యాటర్ బాగా వైరల్ అవుతోంది. జూన్ 9 న వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే రీసెంట్ గా వరుణ్, లావణ్య పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై వరుణ్ తండ్రి నాగబాబు స్పందించారు. వరుణ్ పెళ్లి గురించి త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే కోడలు ఎవరు అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా మొత్తానికి వరుణ్, లావణ్యల పెళ్లి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందని నాగబాబు మాటలు చూస్తుంటే తెలుస్తోందని చెవులు కొరుక్కొంటున్నారు మెగా అభిమానులు. 

కూల్ గా పిజ్జా తింటున్న వరుణ్ తేజ్..

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై వరుణ్ తేజ్ ఏ మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం వరుణ్ ఫారిన్ లో హాలిడే ట్రిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మాత్రం వరుణ్ పెళ్లిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. అందులో ఆయన తాపీగా కూర్చొని పిజ్జా తింటున్నట్లు కనిపిస్తోంది. అంతే కాదు దానితో పాటు ఏవో ఫుడ్ ను ప్రిపేర్ చేస్తున్నట్టు ఉంది. దీంతో ఈ ఫోటోలపై మెగా అభిమానులు ఫన్నీ గా స్పందిస్తున్నారు. ‘ఇక్కడ నీ పెళ్లి అని అంటుంటే నువ్ మాత్రం అక్కడ హ్యాపీగా పిజ్జా తింటున్నావా అన్నా’ అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. కొంత మంది అయితే ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నా’ అని, ‘అసలు నువ్ ఎక్కడ ఉన్నావ్ అన్నా’, ‘ఇప్పటి నుంచే వంటలు నేర్చేకుంటున్నావా అన్నా’, ‘లావణ్య ఎక్కడ ఉంది అన్నా’ అంటూ రకరకాలుగా స్పందించేస్తున్నారు. ఇంకొంత మంది అయితే ‘అన్నా హెల్త్ జాగ్రత్త ఫాస్ట్ ఫుడ్ లు తినొద్దు’ అంటూ రాసుకొస్తున్నారు. మొత్తానికి అందరూ వరుణ్ తేజ్ పెళ్లి గురించి టెన్షన్ పడుతుంటే మనోడు మాత్రం హాలిడేను సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. 

లావణ్య కూడా అక్కడే?

ప్రస్తుతం వరుణ్ తేజ్ ఫారిన్ లో ఉన్నాడు. అటు లావణ్య త్రిపాఠి కూడా ఇండియాలో లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం లావణ్య ఎయిర్పోర్ట్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలకు ట్రావెల్ మోడ్ అని ట్యాగ్ లైన్ ను రాసుకొచ్చింది.  దీంతో వీరిద్దరూ కలిసి ఫారిన్ టూర్ కు వెళ్లారంటూ ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే వీరిద్దరూ ఇండియాకు తిరిగి రాగానే ఎంగేజ్మెంట్ ను చేస్తారని అందరూ చర్చించుకుంటున్నారు. రీసెంట్ గా నాగబాబు కూడా ఈ విషయం పై సూత్రప్రాయంగా స్పందించారు. దీంతో వీరిద్దరి పెళ్లి ఖాయమని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత వరుణ్ పెళ్లి లో మెగా హీరోలు అందరినీ ఒకేసారి చూడొచ్చని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పెళ్లి వార్తలపై మెగా ఫ్యామిలీ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

View this post on Instagram
 
A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

Published at : 02 Jun 2023 03:14 PM (IST) Tags: Lavanya Tripathi Varun tej Varun Lavanya Marriage Varun-Lavanya

ఇవి కూడా చూడండి

KGF 3: యశ్, ‘KGF’అభిమానులకు సూపర్ న్యూస్, ‘KGF3' విడుదల ఎప్పుడో చెప్పేసిన హోంబలే ఫిల్మ్స్!

KGF 3: యశ్, ‘KGF’అభిమానులకు సూపర్ న్యూస్, ‘KGF3' విడుదల ఎప్పుడో చెప్పేసిన హోంబలే ఫిల్మ్స్!

Janhvi Kapoor: ఆ వెబ్ సైట్ లో నా మార్ఫింగ్ ఫోటోలు చూసి షాకయ్యా- జాన్వీ కపూర్

Janhvi Kapoor: ఆ వెబ్ సైట్ లో నా మార్ఫింగ్ ఫోటోలు చూసి షాకయ్యా- జాన్వీ కపూర్

Madhurapudi Gramam Ane Nenu : ఊరికి ఒక ఆత్మ ఉంటే - కళ్యాణ్ రామ్ 'కత్తి' దర్శకుడి కొత్త సినిమా!

Madhurapudi Gramam Ane Nenu : ఊరికి ఒక ఆత్మ ఉంటే - కళ్యాణ్ రామ్ 'కత్తి' దర్శకుడి కొత్త సినిమా!

Gruhalakshmi September 30th: లాస్యని ఘోరంగా అవమానించిన భాగ్య- దివ్య విక్రమ్ ముందు దోషిగా నిలబడుతుందా!

Gruhalakshmi September 30th: లాస్యని ఘోరంగా అవమానించిన భాగ్య- దివ్య విక్రమ్ ముందు దోషిగా నిలబడుతుందా!

Priyanka Mohan - Nani : నానితో మరోసారి - తమిళమ్మాయికి మరో తెలుగు సినిమా!

Priyanka Mohan - Nani : నానితో మరోసారి - తమిళమ్మాయికి మరో తెలుగు సినిమా!

టాప్ స్టోరీస్

బెలూన్‌లా ఉబ్బిపోతున్న అంగన్‌వాడి పాల ప్యాకెట్లు- సోషల్ మీడియాలో వీడియో వైరల్‌- జగన్‌పై లోకేష్ తీవ్ర ఆరోపణలు

బెలూన్‌లా ఉబ్బిపోతున్న అంగన్‌వాడి పాల ప్యాకెట్లు- సోషల్ మీడియాలో వీడియో వైరల్‌- జగన్‌పై లోకేష్ తీవ్ర ఆరోపణలు

Telangana Congress : గెలుపు గుర్రాలకే టిక్కెట్లు - సీనియర్లు అయినా బేరాల్లేవ్ ! కాంగ్రెస్ హైకమాండ్ ఒక్కటే మాట

Telangana Congress : గెలుపు గుర్రాలకే టిక్కెట్లు - సీనియర్లు అయినా బేరాల్లేవ్ ! కాంగ్రెస్ హైకమాండ్ ఒక్కటే మాట

తెలుగు యూనివర్సిటీ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలు

తెలుగు యూనివర్సిటీ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలు

Skanda Day 2 Collections: బాక్సాఫీస్ దగ్గర తగ్గిన ‘స్కంద’ జోరు, తొలి రోజుతో పోల్చితే సగానికిపైగా పడిపోయిన కలెక్షన్స్

Skanda Day 2 Collections: బాక్సాఫీస్ దగ్గర తగ్గిన ‘స్కంద’ జోరు, తొలి రోజుతో పోల్చితే సగానికిపైగా పడిపోయిన కలెక్షన్స్